ఇంటి పైనుంచి దూకి వ్యక్తి ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

ఇంటి పైనుంచి దూకి వ్యక్తి ఆత్మహత్య

Sep 23 2026 1:37 AM | Updated on Sep 23 2026 1:37 AM

రాయచోటి : అన్యోన్యంగా ఉండాల్సిన దాంపత్యం అనుమానాలతో అతలాకుతలమై ప్రాణాల మీదకు తెచ్చిన సంఘటన రాయచోటిలో చోటు చేసుకుంది. 8 ఏళ్ల కిందట వివాహం చేసుకున్న దంపతులు నలుగురు సంతానంతో సంతోషంగా జీవితం సాగిస్తున్న సమయంలో భార్యపై అనుమానం పెనుభూతమై 35 ఏళ్ల యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డారు. మృతుని బంధువుల వివరాల ప్రకారం.. రాయచోటి పట్టణానికి చెందిన షాకీర్‌ (35) గున్నికుంట్ల మార్గంలోని గవర్నర్‌ కల్యాణ మండపం సమీపంలోని బంధువుల ఇంటిపై నుంచి సోమవారం రాత్రి 12:30 గంటల సమయంలో దూకి మృత్యువాతపడ్డాడు. వివరాలలోకి వెళ్లితే.. షేక్‌ అఖిలతో 8 ఏళ్ల కిందట అతడికి వివాహమైంది. వీరికి నలుగురు సంతానం. స్థానికంగా ప్రైవేట్‌ టైర్ల దుకాణంలో పనిచేస్తూ పట్టణ పరిధిలోని శిబకతుల్లా కాలనీలో జీవనం సాగిస్తున్నారు. కొద్దిరోజులుగా భార్య ప్రవర్తనపై అనుమానం మొదలై ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరిగేవని స్థానికులు తెలిపారు. సోమవారం సాయంత్రం కూడా భార్యతో గొడవపడి ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయాడు. సోమవారం రాత్రి 10 గంటల సమయంలో పట్టణంలోని గున్నికుంట్ల మార్గంలోని తన చిన్నమ్మ ఇంటికి వెళ్లాడు. మిద్దైపెన నిద్రపోతానని చెప్పి వెళ్లిన తర్వాత రాత్రి 12.30 గంటల సమయంలో పైనుంచి కిందికి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. తీవ్రగాయాలతో ఉన్న షాకీర్‌ను బంధువులు రాయచోటి ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. ఆసుపత్రిలో వైద్యులు పరిశీలించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. షాకీర్‌ కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు రాయచోటి అర్బన్‌ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.

అదనపు కట్నం కోసం వేధింపులు

ముద్దనూరు : అదనపు కట్నం తేవాలని భార్యను వేధిస్తున్నాడని అరుణ్‌పై పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు. హెడ్‌కానిస్టేబుల్‌ త్రివేది సమాచారం మేరకు.. మండలంలోని నల్లబల్లె గ్రామానికి చెందిన అరుణ్‌కు సాయి దుర్గతో ఏడాదిన్నర క్రితం వివాహమైంది. కొంతకాలంగా అరుణ్‌ అతని భార్య దుర్గను అదనపు కట్నం తేవాలని శారీరంగా, మానసికంగా వేధిస్తున్నాడు. భార్యపై దాడి చేయడంతో ఆమెకు గాయాలవడంతో చికిత్స నిమిత్తం ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మంగళవారం బాధితురాలి ఫిర్యాదు మేరకు అరుణ్‌, అతని అవ్వపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement