ములకలచెరువు: అకోల నుంచి ములకలచెరువు మీదుగా తిరుపతికి వెళ్లే ఎక్స్‌ప్రెస్ రైలు సోమవారం మూడు గంటల పాటు ఆలస్యంగా నడిచింది. మధ్యాహ్నం 2.23 గంటలు రావాల్సిన రైలు సాయంత్రం 5.31 గంటలకు ములకలచెరువు రైల్వేస్టేషన్‌కు చేరుకుంది. సాంకేతిక కారణాలతో రైలు ఆలస్యంగా వచ్చినట్లు రైల్వే అధికారులు తెలిపారు.
టెన్నికాయిట్ జట్ల ఎంపిక
మదనపల్లె సిటీ: టెన్నికాయిట్ జిల్లా బాల,బాలికల జట్ల ఎంపిక సోమవారం మదనపల్లె జెడ్పీ ఉన్నత పాఠశాలలో జరిగింది .జిల్లా నలుమూలల నుంచి క్రీడాకారులు హాజరయ్యారు. టెన్నికాయిట్ జిల్లా అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు టి.చిన్నప్ప, నందకిషోర్‌రెడ్డి ఎంపికై న వారి వివరాలు ప్రకటించారు. బాలుర విభాగంలో సి,జయంత్‌కుమార్, (జెడ్పీహెచ్‌ఎస్, వగళ్ల), పి.సోమేంద్ర ( జెడ్పీహెచ్‌ఎస్, వగళ్ల), సి.గురుహర్ష (జెడ్పీహెచ్‌ఎస్, ముదివేడు), పి.సమీర్‌ఖాన్(జెడ్పీహెచ్‌ఎస్, ముదివేడు), బాలికల విభాగంలో టి.మాధవి (జెడ్పీహె చ్‌ఎస్, దేవలచెరువు),సి.దుర్గా (జెడ్పీహె చ్‌ఎస్,రామసముద్రం),ఎ.పూజిత (జెడ్పీహెచ్‌ఎస్, దేవలచెరువు), నేహ (బాలుర ఉన్నత పాఠశాల, కలికిరి),స్టాండ్ బైగా ఎన్.చందు ఎంపికయ్యారు. ఎంపికై న వారు అక్టోబర్ 11 నుంచి 13 వరకు శ్రీకాకుళం జిల్లా పలాసలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు.
బాధ్యతల స్వీకరణ
మదనపల్లె టౌన్: అన్నమయ్య జిల్లా మదనపల్లె డివిజన్‌లో ఇటీవల ఐదుగురు సీఐలు బదిలీ అయ్యారు.సోమవారం వీరు బాధ్యతలు స్వీకరించారు. ఇందులో భాగంగా మదనపల్లె వన్ టౌన్‌న్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్‌గా మోహన్‌కుమార్ బాధ్యతలు చేపట్టారు. మదనపల్లె తాలూకా పోలీస్ స్టేషన్ సీఐగా మహమ్మద్ రఫీ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో తాలూకా సీఐగా పనిచేసిన కళా వెంకటరమణ బి. కొత్తకోటకు బదిలీపై వెళ్లారు. దీంతో మదనపల్లె రెండో పట్టణ పోలీస్ స్టేషన్ సీఐగా పనిచేస్తున్న మహమ్మద్ రఫీ తాలూకా పోలీస్ స్టేషన్‌కు బదిలీపై వచ్చారు. బాధ్యతలు చేపట్టిన ఇద్దరు సీఐలు మాట్లాడుతూ తమ పరిధిలో శాంతిభద్రతలను కాపాడటంతో పాటు ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలు అందించేందుకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలిపారు.
మదనపల్లె టౌన్: అందరి సహకారంతో అన్నమయ్య జిల్లాను ఎయిడ్స్ రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని కలెక్టర్ నిశాంత్ కుమార్ అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో ‘మొబిలైజేషన్ ఆఫ్ ఎయిడ్స్ సురక్ష’ కరపత్రాలను కలెక్టర్ ఆవిష్కరించారు. హెచ్‌ఐవీ/ఎయిడ్స్ పై అవగాహన కల్పించాలని, హైరిస్క్ వ్యక్తులను గుర్తించి పరీక్షలు చేయాలని, పాజిటివ్ వచ్చిన వారికి ఏఆర్టీ మందులు క్రమం తప్పకుండా వాడేలా చూడాలని, ఐసీటీసీ కేంద్రాల్లో కిట్లు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. సబ్ కలెక్టర్ కళ్యాణి, డీఎంహెచ్‌ఓ శ్రీనివాసులు పాల్గొన్నారు.
హానర్స్‌లో
ప్రవేశాలకు ఆహ్వానం
కడప ఎడ్యుకేషన్: యోగి వేమన విశ్వ విద్యాలయం పరిధిలోని అన్ని యాజమాన్య కళాశాలలో డిగ్రీ మూడు సంవత్సరాలు పూర్తి చేసుకున్న విద్యార్థులకు 4వ సంవత్సరం హానర్స్‌లో ప్రవేశాలు కల్పిస్తున్నట్లు ప్రిన్సిపల్ జె. వెంకట లక్ష్మి తెలిపారు. అర్హతలు కలిగిన విద్యార్థులు ఈ నెల 22 నుంచి 28 తేదీల్లోపు తమ ఒరిజినల్ సర్టిఫికెట్‌లతో 9491112150, 9441689606 నంబర్స్‌లో సంప్రదించాలని సూచించారు.
24 నుంచి పవిత్రోత్సవాలు
కడప సిటీ : దేవునికడప శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో సెప్టెంబరు 24 నుంచి 26వ తేదీ వరకు పవిత్రోత్సవాలు నిర్వహించనున్నారు. సెప్టెంబరు 23న సాయంత్రం పుణ్యాహవచనం, అంకురార్పణ జరుగుతుంది. ఇందులో భాగంగా 24న ఉదయం చతుష్టార్చాన, అగ్ని ప్రతిష్ట, సాయంత్రం యా గశాలలో వైదిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. సెప్టెంబరు 25న పవిత్ర సమర్పణ, సెప్టెంబరు 26న పూర్ణాహుతి, పవిత్రవితరణ, స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తుల ఊరేగింపు కార్యక్రమాలు జరగనున్నాయి.
మోహన్ కుమార్ మహమ్మద్ రఫీ


