సమస్యలు పరిష్కరించాలని నిరసన | - | Sakshi
Sakshi News home page

సమస్యలు పరిష్కరించాలని నిరసన

Sep 22 2026 12:24 AM | Updated on Sep 22 2026 12:24 AM

మదనపల్లె (కురబలకోట): సమస్యలు పరిష్కరించాలని సోమవారం మదనపల్లె కలెక్టరేట్‌ వద్ద పలువురు నిరసన వ్యక్తం చేశారు. దద్ధరల్లింది. మదనపల్లె లో డీపీటీఓ (ఆర్టీసీ డిప్యూటి ట్రాన్స్‌పోర్టు ఆఫీసు) కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని ఏఐటియూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి సాంబ శివ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చారు. ఆర్టీసీ డ్రైవర్లు, ఉద్యోగులు, కార్మికులు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అన్నమయ్య జిల్లా గాలివీడు మండలం ఎగువ గొట్టివీడు వీఆర్‌ఓ నిర్మల్‌ కుమార్‌ అక్రమాలకు పాల్పడుతున్నారని వెంటనే సస్పెండ్‌ చేయాలని సీపీఐ (ఎంఎల్‌) లిబరేషన్‌ పార్టీ జిల్లా కార్యదర్శి మావులూరి విశ్వనాథ్‌ ఆధ్వర్యంలో పీజీఆర్‌ఎస్‌లో ఫిర్యాదు చేశారు. అంతకు ముందు కలెక్టరేట్‌ ముందు ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. మావిళ్లపల్లికి చెందిన పేద మహిళ ఇంటికి కాంపౌండ్‌ గోడ కట్టడంతో పాటు ఇబ్బందులకు గురి చేశారన్నారు. మదనపల్లె పట్టణంలో మెకానిక్స్‌, ఎలక్ట్రిషియన్స్‌, బాడీ బిల్డర్స్‌, పెయింటర్స్‌కు స్థానిక పుంగనూరు రోడ్డులో కేటాయించిన ఆటోనగర్‌ స్థల వివాదాన్ని పరిష్కరించాలని యూనియన్‌ నాయకులు శ్రీనివాసులు ఆధ్వర్యంలో డిమాండ్‌ చేశారు. 18 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న ప్లాట్లను కార్మికులకు అప్పగించాలని కోరుతూ జిల్లా కలెక్టర్‌ను కోరారు. కోడిగుడ్లు, చిక్లీలలో అక్రమాలకు పాల్పడ్డాడని డీఈఓ సుబ్రమణ్యంపై తగు చర్యలు తీసుకోవాలని ఏఐఎస్‌పీ, ఎఎఫ్‌ఐ, యుఎస్‌ఎఫ్‌ఐ వేర్వేరుగా కలెక్టరేట్‌ వద్ద నిరసన, ధర్నా కార్యక్రమాలు నిర్వహించి జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. గుర్రంకొండ మండలం చెర్లోపల్లి గ్రామం కొత్తపేట–2 వీధిలో 34 ఏళ్లుగా దారి ఉంది. 25 ఇళ్లు దాకా కట్టుకున్నారు. ఇటీవల ఈ వీధికి రాకపోకలకు వీలు లేకుండా రెండు వైపులా ఫెన్సింగ్‌ వేశారు. రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందించలేదు. అధికార పార్టీ అండతో వివిధ రకాలుగా ఇబ్బందులకు గురిచేస్తున్నారని అడ్డుగా వేసిన ఫెన్సింగ్‌ ను తొలగింపజేసి న్యాయం చేయాలని పీజీఆర్‌ఎస్‌లో కోరారు. వెంటనే ఫెన్సింగ్‌ తొలగించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement