ఓట్ల లెక్క తేలింది | - | Sakshi
Sakshi News home page

ఓట్ల లెక్క తేలింది

Sep 22 2026 12:24 AM | Updated on Sep 22 2026 12:24 AM

మదనపల్లె, పుంగనూరులో

బీసీ ఓటర్లే అధికం

జాబితా ప్రచురించిన కమిషనర్లు

సాక్షి, మదనపల్లె: మున్సిపల్‌ ఎన్నికల ప్రక్రియలో భాగంగా సోమవారం మదనపల్లె, పుంగనూరు మున్సిపాలిటీల్లో వర్గాల వారీగా ఓటర్ల జాబితాలను ప్రచురించారు. రెండు మున్సిపాలిటీల్లోనూ బీసీ ఓటర్లే అత్యధికంగా ఉన్నారు. పుంగనూరులో ఎస్టీ ఓటర్లు తక్కువగా ఉన్నారు. సెలక్షన్‌ గ్రేడ్‌ మదనపల్లె మున్సిపాలిటీలో వార్డుల పునర్విభజన తర్వాత 48 ఏర్పడ్డాయి. వీటి పరిధిలో 1,16,958 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్లను లెక్కించారు. ఎస్టీలు 3,254 ఓటర్లు, ఎస్సీలు 6,0 26 , బీసీలు 67,254 మంది ఓటర్లను గుర్తించారు. ఇతరులు 40,424 మంది ఉన్నారు. పుంగనూరు మున్సిపాలిటీలో వార్డుల పునర్విభజన తర్వాత 36 వార్డులు ఏర్పడ్డాయి. ఇక్కడ ఎస్టీ ఓటర్లు 389 మంది, ఎస్సీ ఓటర్లు 3,548 మంది, బీసీ ఓటర్లు 27,488 మంది, ఇతరులు 12,526 మంది ఉన్నట్లు ప్రకటించారు. మున్సిపల్‌ ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియ ఒక్కొక్కటిగా ప్రభుత్వం పూర్తి చేసుకుంటూ పోతోంది. ఇప్పటికే ఓటర్‌ జాబితా ప్రచరణ, పోలింగ్‌ కేంద్రాలు, వాటి అభ్యంతరాల స్వీకరణ, ప్రచురణ, ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్ల జాబితా ప్రచురణ పూర్తయింది. తాజాగా ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్ల సంఖ్యను ప్రకటిస్తూ జాబితాను ప్రకటించారు. రిజర్వేషన్ల ప్రక్రియ మాత్రమే మిగిలి ఉంది. చైర్మన్‌, వార్డుల రిజర్వేషన్లు ప్రకటిస్తే తరువాత ఎన్నికలకు వెళ్లడమే మిగిలి ఉంటుంది. అయితే కోర్టు కేసులు తేలేదాక రిజర్వేషన్ల ప్రకటన పెండింగ్లో ఉండే అవకాశం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement