బైక్‌ ఢీకొని మహిళకు తీవ్ర గాయాలు | - | Sakshi
Sakshi News home page

బైక్‌ ఢీకొని మహిళకు తీవ్ర గాయాలు

Sep 21 2026 6:29 AM | Updated on Sep 21 2026 6:29 AM

బైక్‌ ఢీకొని మహిళకు తీవ్ర గాయాలు

మదనపల్లె టౌన్‌ : బైక్‌ ఢీకొని ఓ మహిళ తీవ్రంగా గాయపడిన సంఘటన శనివారం రాత్రి మదనపల్లెలో జరిగింది. బాధితురాలి కథనం మేరకు.. పట్టణంలోని నీరుగట్టుపల్లె–కోళ్లబైలు రోడ్డులో నివాసం ఉంటున్న రాజేశ్వరి (40) తన భర్తకు మందులు కొనుగోలు చేసేందుకు మందుల షాపు వద్దకు వెళ్తుండగా, వేగంగా వచ్చిన బైక్‌ ఆమెను ఢీకొట్టి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ప్రమాదంలో రాజేశ్వరి తీవ్రంగా గాయపడటంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రి అత్యవసర విభాగం డాక్టర్లు ప్రథమ చికిత్స అందించడంతో కోలుకుంటున్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement