యువరైతు దారుణ హత్య | - | Sakshi
Sakshi News home page

యువరైతు దారుణ హత్య

Sep 21 2026 6:29 AM | Updated on Sep 21 2026 6:29 AM

యువరైతు దారుణ హత్య

బి.కొత్తకోట (మదనపల్లె టౌన్‌) : బి.కొత్తకోట మండలం నాయనిబావిలో యువ రైతు దారుణ హత్య తీవ్ర విషాదాన్ని నింపింది. గ్రామానికి చెందిన గంగిరెడ్డి కుమారుడు యువరైతు గోపాల్‌ రెడ్డి(40) తన వ్యవసాయ బోరు వద్ద ఒంటరిగా ఉన్న సమయంలో గుర్తు తెలియని ముగ్గురు వ్యక్తులు ఒక్కసారిగా దాడి చేశారు. అనంతరం డ్రిప్‌ పైపులతో కాళ్లు, చేతులు కట్టేసి సమీపంలోని పొదల్లోకి లాక్కెళ్లి, ఇనుపరాడ్లు, బండరాళ్లతో తలపై మోది దారుణంగా హత్య చేసి పరారయ్యారు. పొలానికి వెళ్లిన గోపాల్‌రెడ్డిని ఆదివారం మధ్యాహ్నం తమ ప్రత్యర్థులు పట్టపగలే హత్య చేయడం తీవ్ర కలకలం రేపుతోంది. భర్త భోజనానికి ఇంటికి రాకపోవడంతో తన పిల్లలని బోరు వద్దకు భార్య ప్రతిభ పంపడంతో అప్పటికే రక్తపు మడుగులో తన తండ్రి విగతజీవిగా పడి ఉండటం చూసి కేకలు వేశారు. స్థానికులు వచ్చి అతడిని ఆస్పత్రికి తరలించేలోపే మృతి చెందారు. సమాచారం అందుకున్న సీఐ గోపాల్‌ రెడ్డి వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పంచనామా అనంతరం మృతదేహాన్ని మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. హత్యకు గురైన గోపాల్‌ రెడ్డి మొదటి భార్య తులశమ్మ చనిపోవడంతో అదే మండలం, తోకలపల్లికి చెందిన ప్రతిభను రెండో వివాహం చేసుకున్నాడు. మొదటి భార్యకు ఇద్దరు కుమారులు, రెండో భార్యకు కొడుకు, కూతురు ఉన్నారు. వ్యవసాయమే జీవనాధారంగా కుటుంబాన్ని పోషిస్తున్న గోపాల్‌రెడ్డి హత్యతో ఆ కుటుంబం పెద్దదిక్కును కోల్పోయింది. ఆసుపత్రి వద్ద భార్య, పిల్లల రోదనలు అందరినీ కలచివేశాయి.

జాగిలంతో నిందితుల కోసం గాలింపు

నాయనిబావిలో గోపాల్‌రెడ్డిని హత్య చేసిన నిందితులను పట్టుకునేందుకు, రాయచోటి నుంచి పోలీస్‌ జాగిలాన్ని రప్పించారు. హత్య జరిగిన ప్రదేశంలో క్షుణ్ణంగా పరిశీలించి, జాగిలం ఎటువైపు వెళ్లింది, ఎక్కడెక్కడ తిరిగింది అనే విషయాలను సీఐ గోపాల్‌ రెడ్డి వివరాలను సేకరించారు.

ఘటనా స్థలాన్ని పరిశీలించిన డీఎస్పీ

ఘటనా స్థలాన్ని మదనపల్లె డీఎస్పీ బుచ్చిరాజు స్థానిక సీఐ గోపాల్‌ రెడ్డితో కలిసి పరిశీలించారు. హత్యకు గల కారణాలపై స్థానికులతో పాటు కుటుంబీకులను వివిధ కోణాల్లో విచారించారు. హత్యకు గొడవలా లేక వివాహేతర సంబంధం వంటి కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ బుచ్చిరాజు తెలిపారు.

నాయుని బావి గ్రామంలో ఘటన

జాగిలంతో ఘటనా స్థలం పరిశీలన

హత్య జరిగిన ప్రదేశాన్ని తనిఖీ చేసిన సీఐ, డీఎస్పీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement