మహిళపై దాడి.. వ్యక్తి అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

మహిళపై దాడి.. వ్యక్తి అరెస్ట్‌

Sep 21 2026 6:29 AM | Updated on Sep 21 2026 6:29 AM

మహిళపై దాడి.. వ్యక్తి అరెస్ట్‌ ద్విచక్రవాహనం చోరీపై ఫిర్యాదు కారు ఢీకొని విశ్రాంత ఉపాధ్యాయుడికి గాయాలు

మదనపల్లె టౌన్‌ : మహిళపై దాడికి పాల్పడిన వ్యక్తిని ఆదివారం పోలీసులు అరెస్టు చేశారు. తాలూకా సీఐ కళా వెంకటరమణ వివరాల ప్రకారం.. మండలంలోని పోతబోలు గ్రామం, ఎరగ్రాని మిట్ట సమీపంలోని టిడ్కో ఇళ్లల్లో నివాసం ఉంటున్న సందీప్‌ కుమార్‌ అలియాస్‌ బుల్లెట్‌ సందీప్‌ (26) అదే ఇళ్లల్లో ఉంటున్న చెల్లా రెడ్డిలక్ష్మి (19)తో పాతకక్షల నేపథ్యంలో ఈ నెల 16న గొడవపడి, దాడి చేసి గాయపరిచాడు. బాధితురాలిని కుటుంబ సభ్యులు జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అనంతరం అదే రోజే తాలూకా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎస్సై విష్ణునారాయణ కేసు నమోదు చేసి ఆదివారం సందీప్‌ కుమార్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు.

పీలేరు : ద్విచక్రవాహనం చోరీకి గురైన సంఘటన పీలేరు పట్టణం కడప మార్గంలో చోటు చేసుకుంది. కడప రోడ్డులో నివాసం ఉంటున్న లోకనాథరెడ్డి తన ఇంటి ఎదుట ద్విచక్రవాహనాన్ని శనివారం రాత్రి పార్కింగ్‌ చేశారు. ఆదివారం ఉదయం ద్విచక్రవాహనం చోరీకి గురైనట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

మదనపల్లె టౌన్‌ : బైక్‌ను కారు ఢీకొన్న ప్రమాదంలో ఓ రిటైర్డ్‌ టీచర్‌ తీవ్రంగా గాయపడిన ఘటన నిమ్మనపల్లె మార్గంలో ఆదివారం చోటుచేసుకుంది. మదనపల్లెలోని సుబ్బారెడ్డి లేఅవుట్‌కు చెందిన రిటైర్డ్‌ టీచర్‌ మనోహర్‌రెడ్డి (64) వ్యక్తిగత పనిపై ఆదివారం బైక్‌పై నిమ్మనపల్లికి వెళ్లారు. పనులు ముగించుకుని తిరిగి మదనపల్లెకు వస్తుండగా, మార్గమధ్యంలోని దిగువ మాసిరెడ్డిగారిపల్లె వద్ద కారు.. బైక్‌ను ఢీకొని అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ఉన్న మనోహర్‌రెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే క్షతగాత్రుడిని, చికిత్స నిమిత్తం మదనపల్లె జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రమాదంలో కారు, బైక్‌ దెబ్బతిన్నాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని ప్రమాదానికి కారణాలపై ఆరా తీశారు. ప్రమాదానికి సంబంధించిన వివరాలు, కారు డ్రైవర్‌ పరిస్థితి తదితర అంశాలపై పోలీసులు విచారణ చేపట్టారు. ఈ ఘటనపై పోలీసులు పూర్తి వివరాలు వెల్లడించాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement