వ్యక్తి ఆత్మహత్యాయత్నం | - | Sakshi
Sakshi News home page

వ్యక్తి ఆత్మహత్యాయత్నం

Sep 21 2026 6:29 AM | Updated on Sep 21 2026 6:29 AM

వ్యక్తి ఆత్మహత్యాయత్నం గుర్తుతెలియని వాహనం ఢీకొని వృద్ధుడు మృతి

మదనపల్లె టౌన్‌ : పురుగుల మందు తాగి ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన ఆదివారం ములకలచెరువు మండలంలో చోటుచేసుకుంది. బాధితుడి కుటుంబీకులు తెలిపిన వివరాల మేరకు.. మదనపల్లె మండలం కొత్తపల్లె పంచాయతీ రంగారెడ్డి కాలనీకి చెందిన వెంకటేష్‌ (60) స్థానికంగా ఉన్న ఓ బార్బర్‌ షాపులో పని చేస్తున్నారు. ఈ క్రమంలో తనకు ఏం కష్టం వచ్చిందో ఏమో.. ములకలచెరువు మండలం పాతకోటలోని బంధువుల ఇంటికి ఆదివారం వెళ్లిన ఆయన, వెంట తెచ్చుకున్న పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. గమనించిన బంధువులు వెంటనే మదనపల్లెకు తరలించి చికిత్స అందించారు.

కలికిరి : గుర్తుతెలియని వాహనం ఢీకొని వృద్ధుడు మృతి చెందిన ఘటన ఆదివారం రాత్రి కలికిరి మండల పరిధిలోని మర్రికుంటపల్లి సమీపంలో జరిగింది. పోలీసుల కథనం మేరకు... పారపట్ల గ్రామం కురవపల్లికి చెందిన గోగుల తిమ్మయ్య (70) ఆదివారం సాయంత్రం కలికిరి నుంచి స్వగ్రామానికి నడుచుకుంటూ వెళుతున్నారు. మర్రికుంటపల్లి సమీపం మేడికుర్తి క్రాస్‌ వద్ద గుర్తు తెలియని వాహనం ఆయనను ఢీకొంది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన తిమ్మయ్య అక్కడికక్కడే మృతి చెందారు. గమనించిన వాహనదారులు కలికిరి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సీఐ అనిల్‌కుమార్‌ సంఘటనా స్థలానికి చేరుకుని మృతుని కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. మృతదేహాన్ని కలికిరి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. తిమ్మయ్యకు మతిస్థిమితం సక్రమంగా లేక తిరుగుతుండేవాడని గ్రామస్తులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement