రైతుకు ఆదాయం చేకూరేలా చర్యలు చేపట్టాలి | - | Sakshi
Sakshi News home page

రైతుకు ఆదాయం చేకూరేలా చర్యలు చేపట్టాలి

Sep 20 2026 6:36 AM | Updated on Sep 20 2026 6:36 AM

పెద్దమండ్యం: ప్రకృతి వ్యవసాయం ద్వారా రైతుకు ఆదాయం చేకూరేలా చర్యలు చేపట్టాలని జిల్లా ప్రకృతి వ్యవసాయ అధికారి బి. వెంకటమోహన్‌ అన్నారు. మండలంలోని ముసలికుంట రైతు సేవా కేంద్రం పరిధిలో ఆర్‌డీఎస్‌ (రబీ డ్రై సోయింగ్‌) పై రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పీఎండీఎస్‌ పద్ధతిలో ఉలవ, అలసంద, అనప, ఆముదం, సజ్జ విత్తనాలను బంతులుగా తయారు చేసి సాగుచేసే విధానాన్ని వివరించారు. ఈ పద్దతి ద్వారా ఐదు ఎకరాల్లో విత్తనాలను విత్తించారు. రైతులు ఈ విధమైన పద్దతిని పాటింటి వేసుకున్నట్లయితే పశువుల మేత భూసారం నష్టపోకుండా రైతుకు ఆదాయం చేకురుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీఈవో మహేష్‌కుమార్‌నాయక్‌, ఎఫ్‌ఎంటిఎస్‌లు వి రవీంద్ర, ఎం శివయ్య, జి రామయ్య పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement