అడవి పందులను వేటాడిన ముగ్గురి అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

అడవి పందులను వేటాడిన ముగ్గురి అరెస్ట్‌

Sep 20 2026 6:36 AM | Updated on Sep 20 2026 6:36 AM

రొంపిచెర్ల : అడవి పందులను వేటాడిన ఘటనలో ముగ్గురిని అరెస్టు చేయగా, మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు ఈస్ట్‌ ఎఫ్‌ఆర్వో థామస్‌, ఎఫ్‌ఎస్‌వో చంద్రశేఖర్‌ తెలిపారు. శనివారం నిందితులను అరెస్టు చేసి వీరికి స్టేషన్‌ బెయిల్‌ మంజూరు చేసినట్లు చిత్తూరులో వారు మీడియాకు తెలిపారు. శుక్రవారం వచ్చిన సమాచారం మేరకు రొంపిచెర్లలో తనిఖీ చేశామన్నారు. క్షేత్రస్థాయిలో పరిశీలించగా ముగ్గురిని అరెస్టు చేశామని, మరో ఇద్దరు తప్పించుకున్నరన్నారు. అరెస్టయిన వారిలో పులిచెర్ల మండలం పెద్దమల్లెల పంచాయతీ గురికివారిపల్లికి చెందిన వెంకటరామయ్య కుమారుడు దొరస్వామి, రొంపిచెర్ల ఎలపడ్డ దళితవాడకు చెందిన సిద్దయ్య కుమారుడు బాబు, రొంపిచెర్ల చెన్నమరెడ్డిగారిపల్లికి చెందిన సిద్దయ్య కుమారుడు వెంకటరమణారెడ్డి ఉన్నారన్నారు. వీరి నుంచి రెండు అడవి పందులు, మరో రెండు అడవి పందుల మాంసం, నాలుగు కత్తులు, విద్యుత్‌ వైర్లు, బైయిండింగ్‌ వైర్లు, చెక్క మొద్దు, ఒక బైక్‌, 3 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. వీరిపై కేసు నమోదు చేసి విచారణ చేయగా, అటవీ ప్రాంతంలో విద్యుత్‌ కంచెలు ఏర్పాటు చేసి, అడవి పందులను వేటాడి, వాటి మాంసం విక్రయిస్తున్నట్లు తెలిసిందన్నారు. పరారీలోని రొంపిచెర్ల దళిత కాలనీ ఎలపాడకు చెందిన వాసు, పెద్దమల్లెలకు చెందిన రాజు కోసం తమ సిబ్బందితో గాలింపు చర్యలు చేపట్టామన్నారు. కార్యక్రమంలో ఎఫ్‌బీఓ గౌస్‌బాషా, ప్రభాకర్‌రెడ్డి, ఎబీఓ భాస్కర్‌, బీటు అధికారులు బాలాజీ, విజయభాస్కర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement