కొత్తపల్లిలో మెరిసిన ప్రతిభా కెరటం | - | Sakshi
Sakshi News home page

కొత్తపల్లిలో మెరిసిన ప్రతిభా కెరటం

Sep 20 2026 6:36 AM | Updated on Sep 20 2026 6:36 AM

శభాష్‌ నవీన్‌ సాయి

కఠోర శ్రమకు దక్కిన సీఎంఏ గౌరవం

మదనపల్లి (కురబలకోట) : లక్ష్యం స్పష్టంగా ఉండి.. నిరంతర కృషి సల్పితే ఎంతటి కఠినమైన పరీక్షలోనైనా రాణించవచ్చని నిరూపించాడు మదనపల్లి మండలం కొత్తపల్లికి చెందిన విద్యార్థి ముడి నవీన్‌ సాయి. ఆయన జాతీయ స్థాయిలో అత్యంత ప్రతిష్టాత్మకమైన కఠినమైన ప్రొఫెషనల్‌ కోర్సుల్లో ఒకటైన కాస్ట్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ అకౌంటెన్సీ (సీఎంఏ)లో ఉతీర్ణత సాధించి కొత్తపల్లితోపాటు జిల్లాలోనే ప్రత్యేకతను నిరూపించుకున్నాడు. ముడి మహేష్‌ బాబు కుమారుడు ముడి నవీన్‌ సాయి జూన్‌–26లో నిర్వహించిన సీఎంఏ ఫైనల్‌ పరీక్షలలో అద్భుత ప్రతిభ కనపరిచాడు. బెంగళూరులోని జయనగర్‌ ఆడిటోరియంలో జరిగిన సీఎంఏ స్నాతకోత్సవంలో ముఖ్య అతిథిగా హాజరైన సీఎంఎ, సీఎఫ్‌ఓ అలోక్‌ ఆచారి చేతుల మీదుగా కాన్వకేషన్‌ సర్టిఫికెట్‌ అందుకున్నారు. ఈ సందర్భంగా నవీన్‌ సాయి మాట్లాడుతూ ఇష్టంగా ప్రణాళికతో చదివితే ఎంటటి కష్టమైన పరీక్షలలోనైనా రాణించవచ్చన్నారు. అధ్యాపకుల మార్గనిర్దేశనం, సమయ పాలన, క్రమశిక్షణ, తల్లిదండ్రుల ప్రోత్సాహం, సహచరుల గైడ్‌లైన్స్‌ తన విజయానికి కారణమన్నారు. నవీన్‌ సాయి తండ్రి ముడి మహేష్‌బాబు మాట్లాడుతూ తన కుమారుడిలో చదువుపై ఉన్న ఆసక్తిని గుర్తించి చిన్నప్పటి నుంచి ప్రోత్సహిస్తూ రావడంతో ఇది సాధ్యమైందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement