ముగిసిన చెన్నకేశవుని పవిత్రోత్సవాలు | - | Sakshi
Sakshi News home page

ముగిసిన చెన్నకేశవుని పవిత్రోత్సవాలు

Sep 19 2026 4:14 AM | Updated on Sep 19 2026 4:14 AM

రాజంపేట: పదకవితాపితామహుడు తాళ్లపాక అన్నమాచార్యులు జన్మస్థలి తాళ్లపాకలో శ్రీ లక్ష్మీచెన్నకేశవస్వామి పవిత్రోత్సవాలు ముగిశాయి. ఇందులో భాగంగా శుక్రవారం స్వామివారికి పల్లకీ సేవ నిర్వహించారు. అంతకముందు ఉత్సవమూర్తులను సుందరంగా అలంకరించి పల్లకిపై కొలువు దీర్చారు.ప్రత్యేకపూజలు నిర్వహించారు. అనంతరం గ్రామపురవీధుల్లో పల్లకీ సేవను కొనసాగించారు. ఈ సందర్భంగా భఽక్తులు కాయకర్పూరాలను సమర్పించారు. కారక్రమంలో టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌ బాలాజీ, మాజీ సర్పంచి గౌరీశంకర్‌ తదితరులు పాల్గొన్నారు.

22 నుంచి

‘సేవా సంకల్ప్‌ అభియాన్‌’

మదనపల్లె సిటీ: ప్రభుత్వ, ప్రైవేటు ఉన్నత పాఠశాలల్లో సంకల్స్‌ అభియాన్‌ కార్యక్రమాల్లో భాగంగా ఈనెల 22,23 తేదీల్లో పాఠశాల స్థాయిలో చిత్రలేఖనం, వకృత్త్వ పోటీలు నిర్వహిస్తున్నట్లు డిఈఓ సుబ్రమణ్యం తెలిపారు.26న నో బ్యాగ్‌డే ప్రదర్శన జరుగుతుందన్నారు. 28వతేదీ మండల స్థాయి పోటీలు జరుగుతాయన్నారు. అక్టోబర్‌ 1వతేదీన జిల్లా స్థాయి ప్రదర్శన, విజేతలకు సత్కారం జరుగుతుందని తెలిపారు. డీవైఈఓలు, ఎంఈఓలు, ప్రధానోపాధ్యాయులు సమన్వయంతో పోటీలు నిర్వహించాలని సూచించారు.

గృహనిర్మాణ శాఖ సీఈ, నలుగురు ఈఈలకు రివర్షన్‌

సాక్షి, మదనపల్లె: గృహ నిర్మాణ శాఖలో పనిచేస్తున్న వారి పదవీ విరమణ వయస్సు 60 నుంచి 62 ఏళ్లకు ప్రభుత్వం పెంచింది. దీంతో ఇప్పటికే ఉద్యోగ విరమణ చేసిన వారిని తిరిగి విధుల్లోకి తీసుకోవడంతో గత ఏడాది పదోన్నతులు పొంది విధులు నిర్వహిస్తున్న ఒక చీఫ్‌ ఇంజనీర్‌, నలుగురు ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్లను ప్రభుత్వం రివర్షన్‌ చేసింది. ప్రధాన కార్యాలయంలో చీఫ్‌ ఇంజినీర్‌ గా ఎస్‌.వేణుగోపాల్‌, ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్లు డి.రమాకాంతరావు, కే.శంకరప్ప, జివి.విశ్వేశ్వరరావు, బి.బుజ్జిబాబులకు గత ఏడాది సెప్టెంబర్‌ లో డీఈఈ నుంచి ఈఈగా ప్రమోషన్‌ లభించింది. దాంతో మీరంతా వివిధ ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్నారు. ఉద్యోగ విరమణ వయస్సు 62 ఏళ్లకు పెంచడంతో, అప్పటికే 14 మంది ఉద్యోగ విరమణ చేసిన ఈఈలు మళ్లీ విధుల్లోకి చేరారు. దీంతో అప్పటి సీఈ పద్మనాభం తిరిగి అదే స్థానంలో చేరగా పదోన్నతితో సీఈగా ఉన్న ఎస్‌. వేణుగోపాల్‌ ను తిరిగి ఎస్‌ఈగా వెనక్కి పంపారు. 14 మంది ఈఈలు తిరిగి చేరడంతో ప్రమోషన్‌ పొందిన నలుగురు ఈఈలను తిరిగి డీఈలుగా వెనక్కి పంపింది. ఈ మేరకు విధుల్లోకి చేరిన వారికి పోస్టింగులు ఇచ్చారు. సీఈగా ఉండి ఎస్సీ అయినా వేణుగోపాల్‌కు ప్రధాన కార్యాలయంలో సీజీఎం, పరిపాలన జీఎంగా బాధ్యతలను అప్పగించారు.

21న డి–ఫార్మసీ

స్పాట్‌ అడ్మిషన్లు

కడప ఎడ్యుకేషన్‌: కడపలోని ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్‌ కళాశాలలో డి ఫార్మసీ కోర్సులో ప్రవేశానికి 21వ తేదీ స్పాట్‌ అడ్మిషన్లను నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్‌ సీహెచ్‌ జ్యోతి తెలిపారు. ఇందుకు సంబంధించిన దరఖాస్తులు ఈ నెల 19వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు స్వీకరిస్తారని చెప్పారు. ఇంటర్‌లో బైపీసీ, ఎంపీసీ ఉత్తీర్ణత పొందిన విద్యార్థులు 10వ తరగతి , ఇంటర్‌ మార్కుల జాబితాలు, కుల ధ్రువీకరణ పత్రం, స్టడీ సర్టిఫికెట్‌, 6 నుంచి ఇంటర్‌ వరకు టీసీ ఒరిజినల్‌తోపాటు మూడు సెట్ల జిరాక్స్‌ కాపీలతో నేరుగా హాజరు కావాలని తెలిపారు. మరిన్ని వివరాలకు 9441667664, 9985391616 నెంబర్లలో సంప్రదించాలని ప్రిన్సిపాల్‌ తెలిపారు.

జాతీయస్థాయి పోటీలకు ఎంపిక

వేంపల్లె : ఆర్జీయూకేటీ ఇడుపులపాయ ఆర్‌కే వ్యాలీ ట్రిపుల్‌ ఐటీ విద్యార్థులు జాతీయ స్థాయిలో జరిగే ప్రజ్ఞ – ది బిజినెస్‌ క్విజ్‌ ఫైనల్‌ పోటీలకు ఎంపికయ్యారని ట్రిపుల్‌ ఐటీ డైరెక్టర్‌ విజయ్‌ ప్రకాష్‌ తెలిపారు. శుక్రవారం ఇడుపులపాయ ఆర్‌కే వ్యాలీ ట్రిపుల్‌ ఐటీలో ఆయన మాట్లాడుతూ జాతీయ స్థాయిలో ఆఫ్‌లైన్‌ ఫైనల్స్‌ 2026 అక్టోబర్‌ 30 నుంచి నవంబర్‌ 1 వరకు భారతీయ మేనేజ్‌మెంట్‌ సంస్థ పోటీలు జరుగుతాయని, ఈ పోటీలకు 7వ జట్టు విద్యార్థులైన శ్రీచక్ర రెడ్డి, శ్రీజారెడ్డి విద్యార్థులు హాజరవుతారన్నారు. ఈ విజయం విద్యార్థుల వ్యాపార పరిజ్ఞానం, సమకాలీన అంశాలపై అవగాహన, పోటీ స్ఫూర్తికి నిదర్శనంగా నిలుస్తుందన్నారు. విద్యార్థులను ఏఓ రవికుమార్‌, డీన్‌ ఆఫ్‌ ఆకడమిక్స్‌ రమేష్‌ కై లాస్‌లతోపాటు అధ్యాపకులు అభినందనలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement