పీఎండీఎస్‌ పంటల సాగుతో అదనపు ఆదాయం | - | Sakshi
Sakshi News home page

పీఎండీఎస్‌ పంటల సాగుతో అదనపు ఆదాయం

Sep 19 2026 4:14 AM | Updated on Sep 19 2026 4:14 AM

జిల్లా కలెక్టర్‌ నిశాంత్‌కుమార్‌

జిల్లా కలెక్టర్‌ నిశాంత్‌కుమార్‌

పీలేరు : బీడు భూముల్లో ప్రీ మాన్‌సూన్‌ డ్రై సోయింగ్‌ (పీఎండీఎస్‌) పంటలు సాగు చేసి రైతులు అదనపు ఆదాయం పొందాలని జిల్లా కలెక్టర్‌ నిశాంత్‌కుమార్‌ అన్నారు. శుక్రవారం మండలంలోని మొరవవడ్డిపల్లెలో పీఎండీఎస్‌ క్షేత్రాలను సందర్శించారు. వేరుశనగ తోపాటు కంది, ఆముదం, అలసంద, ఎర్రతోటకూర, చిక్కుడు, పెసలు, మినుములు, సజ్జలు, వంటి అనుబంధ పంటలు సాగు చేసిన విధానాన్ని పరిశీలించారు. అలాగే మామిడి తోటలో పీఎండీఎస్‌ పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడుతూ ఉద్యాన తోటల్లో ఖాళాగా ఉన్న స్థలాలను సద్వినియోగం చేసుకుంటూ పీఎండీఎస్‌ను పెద్ద ఎత్తున చేపట్టాలని సూచించారు.

సచివాలయాల్లో ప్రజల సమస్యలు పరిష్కరించడంలో అలసత్వం వద్దు అని జిల్లా కలెక్టర్‌ నిశాంత్‌కుమార్‌ అన్నారు. మండలంలోని తలపుల సచివాలయాన్ని కలెక్టర్‌ తనిఖీ చేశారు. పీజీఆర్‌ఎస్‌ ఫిర్యాదులు, పెన్షన్లపై సమీక్షించారు. అనంతరం బోడునాయినిదొడ్డిలో వీబీజీ రామ్‌జీ ఉపాధి పనులు పరిశీలించారు. ఉపాధి కూలీలతో మాట్లాడారు. గ్రామంలో చేపట్టిన సంకన్‌పాండ్‌ పనులు పరిశీలించి దాని ఉపయోగాలు అడిగి తెలుసుకున్నారు.

పీఎంశ్రీ పథకంతో పాఠశాలల అభివద్ధి...

పీఎంశ్రీ పథకంలో ఎంపికై న పాఠశాలలు అన్ని విభాగాల్లో అభివృద్ధిని సంతరించుకుంటాని జిల్లా కలెక్టర్‌ నిశాంత్‌కుమార్‌ అన్నారు. స్థానిక చిత్తూరు రోడ్డు మార్గంలో అంబేడ్కర్‌ బాలికల గురుకుల పాఠశాలను సందర్శించి పీఎంశ్రీ నిధులతో చేపట్టిన అభివృద్ధి పనుల గురించి ఆరా తీశారు. గత ఏడాది పాఠశాలలో సుమారు రూ. 7.50 లక్షల అంచనాతో ప్లే గ్రౌండ్లు, కీచెన్‌ గార్డెన్‌, ఫెన్సింగ్‌, రెన్‌వాటర్‌ హార్వెస్టింగ్‌ సనులు చేపట్టి రూ. 6.30 లక్షలు ఖర్చు పెట్టినట్లు అధికారులు కలెక్టర్‌కు తెలిపారు. ఈ కార్యక్రమంలో సమగ్ర శిక్ష ఏపీసీ అనురాధ, తహశీల్దార్‌ శివకుమార్‌, ఏడీఏలు హరిప్రియ, కె. గుణశేఖరపిళ్లై, ఏపీసీఎన్‌ఎఫ్‌ జిల్లా ప్రాజెక్టు మేనేజర్‌ బి. వెంకటమోహన్‌, ఏవో రమాదేవి, హెచ్‌వో సుకుమార్‌రెడ్డి,

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement