విరబూసిన బ్రహ్మకమలం | - | Sakshi
Sakshi News home page

విరబూసిన బ్రహ్మకమలం

Sep 19 2026 4:14 AM | Updated on Sep 19 2026 4:14 AM

విరబూసిన బ్రహ్మకమలం

వాల్మీకిపురం : పట్టణంలోని బైపాస్‌ రోడ్డులో నివాసం ఉండే పసుపులేటి లక్ష్మీకాంతమ్మ ఇంటి పెరట్లో బ్రహ్మకమలం మొక్క నాటారు. సాధారణంగా బ్రహ్మకమలాలు వర్షాకాలం నుంచి శరదృతువు వరకు ఉండే సమయం జూలై నుంచి సెప్టెంబరు నెలల్లో వికసిస్తాయి. ఈ క్రమంలో వీరి ఇంట్లో ఉండే బ్రహ్మకమలం మొక్కకు శుక్రవారం ఉదయం ఒకే రోజులో ఐదు పుష్పాలు వికసించాయి. ఎంతో అరుదుగా కనపడే ఈ బ్రహ్మకమలం పుష్పాలను హిందూ సంప్రదాయంలో చాలా శుభ్రప్రదమైన పువ్వుగా భావిస్తారు. దీంతో స్థానికులు ఈ పుష్పాలను ఆసక్తిగా తిలకించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement