వృద్ధురాలి హత్య కేసులో మరో నిందితుడి అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

వృద్ధురాలి హత్య కేసులో మరో నిందితుడి అరెస్ట్‌

Sep 19 2026 4:14 AM | Updated on Sep 19 2026 4:14 AM

వృద్ధురాలి హత్య కేసులో మరో నిందితుడి అరెస్ట్‌

పూడ్చి పెట్టేందుకు సహకరించిన వ్యక్తికి రిమాండ్‌

రెండు బంగారు ముక్కు పుడకలు స్వాధీనం

మదనపల్లె టౌన్‌ : ఒంటరిగా జీవిస్తున్న 83 ఏళ్ల వృద్ధురాలి హత్య కేసులో మరో నిందితుడిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. మదనపల్లె మండలం కొండామారిపలె్‌ల్‌ పంచాయతీ పుంగనూరువాండ్లపల్లె సమీపంలోని ఆర్‌టీఓ కార్యాలయం ఎదురుగా నివసించే నూలు లక్ష్మీదేవి(83) సొంత స్థలంలో ఇల్లు, అంగడి గది నిర్మించుకుని చిల్లర దుకాణం, టీ దుకాణం నిర్వహిస్తూ జీవించేవారు. అక్కడే ఆర్‌టీఓ కార్యాలయంలో పార్ట్‌టైం సెక్యూరిటీగా పని చేసే అత్తూరి శరచంద్రప్రసాద్‌ అలియాస్‌ బాలాజీ, అతనితో సహజీవనం చేస్తున్న ప్రమీల తరచూ లక్ష్మీదేవితో చనువుగా ఉంటూ ఆమె నమ్మకాన్ని పొందినట్లు పోలీసులు తెలిపారు. తిరుపతిలో నామకరణ కార్యక్రమం ఉందని నమ్మించి గత నెల 19న కారులో తీసుకెళ్లి రేణిగుంట మండలం ములగమూడి సమీపంలోని చెరువు పొరంబోకు భూమి వద్ద గొంతు నులిమి హత్య చేసినట్లు వెల్లడించారు. అనంతరం ఆమె ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలను తీసుకుని, మృతదేహాన్ని ఇసుకలో పూడ్చేందుకు ములగమూడి శంకరయ్య సహకరించినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో బాలాజీ, ప్రమీలను ఇప్పటికే అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించగా.. తాజాగా వారికి సహకరించిన ఏ3 నిందితుడు ములగమూడి శంకరయ్య (60)ను 17వ తేదీన మధ్యాహ్నం తిరుపతి జిల్లా వడమాలపేట బస్టాండ్‌లో అరెస్ట్‌ చేశామన్నారు. అతని వద్ద కుదువ పెట్టిన రెండు బంగారు ముక్కుపుడకలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం జిల్లా ఎస్పీ ధీరజ్‌, డీఎస్పీ బుచ్చిరాజు పర్యవేక్షణలో తాలూకా సీఐ ఒ.కళావెంకటరమణ నిందితుడి అరెస్ట్‌ చూపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement