బాలుడి వైద్యానికి ఎంపీ మిఽథున్‌రెడ్డి భరోసా | - | Sakshi
Sakshi News home page

బాలుడి వైద్యానికి ఎంపీ మిఽథున్‌రెడ్డి భరోసా

Sep 18 2026 1:45 AM | Updated on Sep 18 2026 1:45 AM

వెదురుకుప్పం : అనారోగ్యంతో వేలూరు సీఎంసీలో చికిత్స పొందుతున్న బాలుడి వైద్యానికి రాజంపేట ఎంపీ మిథున్‌ రెడ్డి పీఎంఎన్‌ఆర్‌ఎఫ్‌ కింద నిధులు మంజూరు చేయించి ఆదుకున్నారు. చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలంలోని తంగేళిమిట్ట గ్రామానికి చెందిన గిరిబాబు కుమారుడి వైద్యానికి రాజంపేట ఎంపీ మిఽథున్‌రెడ్డి భరోసా కల్పించారు. బాలుడు అనారోగ్యంతో వేలూరు సీఎంసీలో చికిత్స పొందుతున్నాడు. బాలుడి వైద్యం కోసం ఇప్పటికే లక్షల రూపాలయలు వెచ్చించారు. ఆర్థిక స్థోమత లేని కారణంగా ఆపన్నహస్తం కోసం స్థానిక నాయకులు కొండారెడ్డి, రామయ్య సమస్యను వైఎస్సార్‌సీపీ గంగాధరనెల్లూరు నియోజకవర్గ సమన్వయకర్త కే. కృపాలక్ష్మి దృష్టికి తీసుకెళ్లారు. బాధిత కుటుంబాన్ని ఎలాగైనా ఆదుకోవాలన్నా సంకల్పంతో రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డిని కలిసి సమస్యను తెలిపారు. దీంతో వెంటనే స్పందించిన ఎంపీ పీఎంఎన్‌ఆర్‌ఎఫ్‌ కింద రూ. 3 లక్షలు మంజూరు చేయించారు. తక్షణమే మెరుగైన వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కాగా గురువారం సాయంత్రం పుత్తూరులోని క్యాంపు కార్యాలయంలో పీఎంఎన్‌ఆర్‌ఎఫ్‌ మంజూరుకు సంబంధించి ప్రొసీడింగ్‌ కాపీని జయరామిరెడ్డికి అందజేశారు. ఈసందర్బంగా మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, సమన్వయకర్త కృపాలక్ష్మి మాట్లాడుతూ మానవసేవే మాదవసేవగా భావించి అందరికీ ఆర్థిక భరోసా ఇస్తున్న ఎంపీ మిథున్‌రెడ్డికి ర ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు చెప్పారు. ఎవరికి ఎలాంటి కష్టం వచ్చినా విథున్‌రెడ్డి అన్నివిదాలా ఆదుకుంటారని తెలిపారు. వైఎస్సార్‌సీపీ అధికారంలో లేకున్నా బాలుడి కుటుంబ ఆర్థిక పరిస్థితిని వివరించిన వెంటనే ప్రధానమంత్రి జాతీయ రిలీఫ్‌ పండ్‌ కింద రూ. 3 లక్షలు మంజూరు చేయించడం అభినందనీయమన్నారు. కష్ట కాలంలో బాలుడి కుటుంబానికి ఆర్థికంగా భరోసా కల్పించడం కొండంత ధైర్యాన్నిచ్చినట్టేనన్నారు. నిధులు మంజూరు చేయించడంతో స్థానిక నాయకులు హర్షం వ్యక్తం చేశారు.

పీఎంఎన్‌ఆర్‌ఎఫ్‌ కింద రూ.3 లక్షలు మంజూరు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement