మదనపల్లె టౌన్ : కుటుంబ సమస్యలతో పురుగుమందు తాగి ఓ యువతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన గురువారం తంబళ్లపల్లె మండలం లో జరిగింది. ఆస్పత్రి ఔట్ పోస్టు పోలీసుల కథనం మేరకు.. మండలంలోని తిమ్మయ్య ఇండ్లకు చెందిన శ్రీనివాసులు భార్య గౌతమి (25), కుటుంబ సమస్యలతో మనస్థాపం చెంది ఇంట్లో ఉన్న పురుగు మందు తాగింది. కుటుంబీకులు ఆమెను మదనపల్లి జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు.డాక్టర్లు మెరుగైన వైద్యం అందించారు. దీంతో ఆమె ప్రాణాపాయం తప్పి కోలు కుంటూ ఉంది.
కుటుంబ సమస్యలతో..
మదనపల్లె టౌన్ : కుటుంబ సమస్యల కారణంగా ఇద్దరు మహిళలు విషం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. బాధితుల కుటుంబీకులు తెలిపిన వివరాల మేరకు.. బి కొత్తకోట మండలం ఇర్రివారిపల్లికు చెందిన శంకరప్ప భార్య సుజాత(40) కుటుంబ సభ్యులతో గొడవపడి మనస్థాపం చెందింది. ఇంట్లో ఉన్న విషం తాగింది. కుటుంబీకులు ఆమెను మదనపల్లె జిల్లా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతోంది. మరో ఘటనలో మదనపల్లి మండలం, పుంగునూరు రోడ్డు లోని జ్యూస్ ఫ్యాక్టరీ క్రిష్ణాపురానికి చెందిన కేశవ భార్యా సన (25), విషం తాగి ఆత్మహత్యకు యత్నించడంతో వెంటనే కుటుంబీకులు ఆమెనే జిల్లా ఆస్పత్రికి తరలించి వైద్య చికిత్సలు అందిస్తున్నారు. పై సంఘటనలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
పుంగనూరు : పెట్రోల్ పోసుకుని ఓ వ్యక్తి ఆత్మహత్యకు యత్నించిన సంఘటన గురువారం జరిగింది. వివరాలిలా ఉన్నాయి. పట్టణానికి చెందిన సద్దాం (38) తన భార్యకు విబేధాలు రావడంతో కోర్టు వద్ద గల బైపాస్ రోడ్డులో పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. స్థానికులు గమనించి బాధితున్ని ఏరియా ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యుల సూచనతో మెరుగైన వైద్యం కోసం తిరుపతికి తీసుకెళ్లారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


