మదనపల్లె టౌన్ : సెల్‌ఫోన్ చోరీ చేశాడనే అనుమానంతో ఓ యువకుడిని స్థానికులు పట్టుకుని చెట్టుకు కట్టేసి దేహశుద్ధి చేసిన ఘటన గురువారం మదనపల్లె మండలంలో చోటుచేసుకుంది. అనంతరం అతడిని పోలీసులకు అప్పగించారు.
పోలీసుల కథనం మేరకు.. బి.కొత్తకోట మండలం గట్టు పంచాయతీ ఎరప్రువారిపల్లెకు చెందిన శంకరప్ప (34) మదనపల్లె మండలం సీటీఎం ప్రాంతంలో సురేష్‌కు చెందిన సెల్‌ఫోన్ చోరీ చేసినట్లు స్థానికులు అనుమానించారు. అతడిని పట్టుకుని సెల్‌ఫోన్ గురించి ప్రశ్నించగా పొంతనలేని సమాధానాలు చెప్పాడని స్థానికులు తెలిపారు. దీంతో అనుమానం వచ్చి కొందరు అతడిని చెట్టుకు కట్టేసి కొట్టినట్లు సమాచారం. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని శంకరప్పను వారి నుంచి విడిపించి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. సెల్‌ఫోన్‌న్ చోరీకి సంబంధించి అతడి నుంచి వివరాలు సేకరిస్తూ విచారణ చేపట్టారు. విచారణలో శంకరప్పపై ఇప్పటికే బి.కొత్తకోట పోలీస్‌స్టేషన్‌న్ లో రెండు కేసులు ఉన్నట్లు గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. అయితే ప్రస్తుత సెల్‌ఫోన్ చోరీ ఘటనలో అతడి ప్రమేయం ఉందా లేదా అనే విషయాన్ని దర్యాప్తు అనంతరం నిర్ధారించాల్సి ఉంది. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని అనుమానితుడిపై దాడి చేయడం సరికాదని, ఏదైనా నేరం జరిగితే పోలీసులకు సమాచారం అందిం చాలని పోలీసులు సూచించారు. ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.


