కేవీపల్లె : వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా కత్తులతో విన్యాసం చేసిన ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు ఎస్‌ఐ వెంకటశివకుమార్ తెలిపారు. వివరాలిలావున్నాయి. మండలంలోని తువ్వపల్లెలో వినాయక చవితి పండుగ సందర్భంగా ఇద్దరు వ్యక్తులు కత్తులు తిప్పడంతో వారిపై కేసు నమోదు చేసి గురువారం అరెస్ట్ చేసి తహశీల్దార్ నరేంద్రకుమార్ ముందు హాజరు పరచినట్లు తెలిపారు. ప్రజలకు ఇబ్బంది కల్గించే విధంగా భయాందోళనలు సృష్టిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
మహిళలపై దాడి
ఎర్రగుంట్ల : వెఎస్సార్ కడప జిల్లా ఎర్రగుంట్ల పట్టణంలో వినాయకుడి ఊరేగింపులో మద్యం మత్తులో కొందరు మహిళలపై దాడికి పాల్పడ్డారు. వెంటనే మహిళలు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. శాంతినగర్ కాలనీ నుంచి రెండు విగ్రహాలు నిమజ్జనానికి బయలుదేరాయి. ఇందులో దివాకర్ అనే వ్యక్తి మద్యం మత్తులో బాణసంచా పేల్చారు. దీందో ఉత్సవంలో పాల్గొని వారికి త్రుటిలో పెద్ద ప్రమాదం తప్పింది. ఇలా ఎందుకు చేశావని మహిళలు అడిగితే దివాకర్ వారిపై దాడికి పాల్పడ్డారు. దీంతో ఉద్రిక్త వాతావారణం నెలకొంది. మహిళలు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దాడి చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకుంటామని సీఐ విశ్వనాథరెడ్డి వారికి తెలియజేశారు


