యువత సమాజం కోసం పనిచేయాలి | - | Sakshi
Sakshi News home page

యువత సమాజం కోసం పనిచేయాలి

Sep 18 2026 1:45 AM | Updated on Sep 18 2026 1:45 AM

మదనపల్లి (కురబలకోట) : సాధారణ కుటుంబ నేపథ్యం నుంచి దేశ ప్రధాన మంత్రి స్థాయికి ఎదిగిన నరేంద్రమోడీ జీవన ప్రస్థానం యువతకు స్ఫూర్తి దాయకమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్‌. మాధవ్‌ అన్నారు. మోదీ జన్మదినం, విశ్వకర్మ జయంతిని పురష్కరించుకుని గురువారం మదనపల్లెలో బీజెపీ ఆధ్వర్వంలొ నిర్వహించిన ర్యాలీ, బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. కష్టాలు ఎదురైనప్పుడు వెనుకడుగు వేయకుండా వాటినే అవకాశాలుగా మలుచుకుని లక్ష్యం వైపు సాగాలనే సందేశాన్ని మోడీ జీవితం అందిస్తోందన్నారు. యువత వ్యక్తిగత ఎదుగుదలకే పరిమితం కాకుండా సమాజం, దేశం కోసం కూడా బాధ్యతతో పనిచేయాలని పిలుపునిచ్చారు. విశ్వకర్మ జయంతిని ప్రస్తావిస్తూ దేశ అభివృద్ధిలో చేతి వృత్తులు, కళాకారులు, శ్రామికుల పాత్ర కీలకమన్నారు. వీటిని ప్రోత్సహిస్తూ భావి తరాలకు అందించాల్సిన అవసరం ఉందన్నారు. బిజేపీ జాతీయ నాయకులు చల్లపల్లి నరసింహా రెడ్డి, రాష్ట్ర నాయకులు విజయభారతి సేతు, జిల్లా అధ్యక్షులు పి. నరేంద్ర కుమార్‌రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి అంగళ్లులోని గోల్డెన్‌వ్యాలీ రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement