అగ్ని ప్రమాద బాధితులకు ఎంపీ రూ.లక్ష సాయం | - | Sakshi
Sakshi News home page

అగ్ని ప్రమాద బాధితులకు ఎంపీ రూ.లక్ష సాయం

Sep 17 2026 12:26 AM | Updated on Sep 17 2026 12:26 AM

నందలూరు : మండలంలోని నాగిరెడ్డిపల్లి గ్రామపంచాయతీ పరిధి అరవపల్లి రైల్వే గేట్‌ సమీపంలోని జయలక్ష్మి ఎలక్ట్రికల్‌ అండ్‌ ఫ్యాన్సీ స్టోర్‌ ఇటీవల విద్యుత్‌ షార్ట్‌సర్క్యూట్‌ కారణంగా అగ్ని ప్రమాదానికి గురై పూర్తిగా దగ్ధమైన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో దుకాణంలోని వస్తువులు పూర్తిగా కాలిపోవడంతో కుటుంబం తీవ్రంగా నష్టపోయింది.ఈ నేపథ్యంలో రాజ్యసభ సభ్యుడు మేడా రఘునాథ రెడ్డి, రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్‌నాథ్‌ రెడ్డి, నందలూరు ఎంపీపీ మేడ విజయభాస్కర్‌ రెడ్డి బాధిత కుటుంబాన్ని పరామర్శించి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం బాధిత కుటుంబానికి ఎంపీ మేడా రఘునాథ రెడ్డి తన సొంత నిధుల నుంచి రూ.లక్ష ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యులు (ఎంపీ) మేడా రఘునాథ రెడ్డి మాట్లాడుతూ అగ్ని ప్రమాదంలో నష్టపోయిన కుటుంబానికి తన వంతు సహాయంగా ఆర్థిక సాయం అందించినట్లు తెలిపారు.

జర్నలిస్టులకు రాష్ట్ర ప్రభుత్వ పురస్కారాలు

కడప సిటీ : జర్నలిజం రంగంలో విశేష సేవలందిస్తూ, వృత్తిపరమైన ప్రతిభను కనబరిచిన పాత్రికేయులను ప్రోత్సహించి, వారి సేవలను గుర్తించి గౌరవించేందుకు 2025 సంవత్సరానికి 12 విభాగాల్లో ఉత్తమ జర్నలిస్టు అవార్డులు అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ అవార్డులకు అర్హులైన వారిని ఎంపిక చేసేందుకు ఆయా విభాగాలకు చెందిన జర్నలిస్టుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు రాష్ట్ర సమాచార పౌరసంబంధాల శాఖ సంచాలకులు కేఎస్‌ విశ్వనాథన్‌ ఒక ప్రకటనలో తెలిపారు. అర్హులైన జర్నలిస్టులు తమ దరఖాస్తులను 2026 సెప్టెంబరు 28వ తేదీ సాయంత్రం 5.00 గంటల్లోగా డైరెక్టర్‌, సమాచార పౌరసంబంధాల శాఖ, 2వ అంతస్తు, ఎన్టీఆర్‌ పరిపాలన భవనం, పండిట్‌ నెహ్రూ బస్‌స్టేషన్‌, విజయవాడ – 520013 అనే చిరునామాకు పంపించాలని ఆయన సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement