మదనపల్లె టౌన్ : అన్నమయ్య జిల్లా కేంద్రంలోని మదనపల్లె సబ్ డివిజన్‌లో ఐదుగురు సీఐలను బదిలీ చేస్తూ అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఉత్తర్వులు జారీ చేశారు.
మదనపల్లె వన్ టౌన్ సీఐ రాజారెడ్డిని ఆర్‌ఎస్‌టీఎఫ్‌కు బదిలీ చేశారు. జిల్లా సీసీఎస్ సీఐ మోహన్‌ను మదనపల్లె వన్ టౌన్‌్ సీఐగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే మదనపల్లె టూటౌన్ సీఐ మహమ్మద్ రఫీని మదనపల్లె తాలూకా సీఐగా, మదనపల్లె తాలూకా సీఐ కళా వెంకటరమణను బి.కొత్తకోట సీఐగా బదిలీ చేశారు. బి.కొత్తకోట సీఐ గోపాల్‌రెడ్డిని మదనపల్లె టూటౌన్ సీఐగా నియమించారు. బదిలీ అయిన అధికారులు వెంటనే విధుల్లో చేరాలని ఎస్పీ ఆదేశించారు.


