మదనపల్లెలో కారు బీభత్సం | - | Sakshi
Sakshi News home page

మదనపల్లెలో కారు బీభత్సం

Sep 16 2026 3:49 AM | Updated on Sep 16 2026 3:49 AM

మదనపల్లె టౌన్‌ : మదనపల్లె పట్టణంలోని రెడ్డెప్ప నాయుడు కాలనీలో మంగళవారం రాత్రి కారు బీభత్సం సృష్టించింది. ఆర్టీసీ బస్సును ఢీకొన్న కారు అదుపుతప్పి రోడ్డుపై ఉన్న మూడు ద్విచక్ర వాహనాలను వరుసగా ఢీకొట్టుకుంటూ వెళ్లింది. ఈ ఘటనతో స్థానికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. అయితే అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ఎవరికీ ప్రాణహాని గానీ, గాయాలు గానీ కాకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. కారును మైనర్‌ నడపడం వల్లే ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపించారు. ప్రమాదం అనంతరం కారును నడిపిన వ్యక్తిని స్థానికులు పట్టుకుని మదనపల్లె టూ టౌన్‌ పోలీసులకు అప్పగించారు. ఘటనపై పోలీసులు వివరాలు సేకరించి దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం స్థానికంగా చర్చనీయాంశంగా మారాయి.

బస్సును ఢీకొని బైక్‌లపైకి దూసుకెళ్లిన వైనం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement