చక్రాయపేట : ప్రసిద్ధి గాంచిన గండి వీరాంజనేయస్వామి దేవస్థానానికి హుండీల ద్వారా రూ.47,90,134 ఆదాయం వచ్చినట్లు ఆలయ సహాయ కమిషనర్ విశ్వనాథ్ తెలిపారు. మంగళవారం ఆయనతోపాటు కడప పక్కీరుపల్లె శ్రీరామస్వామి దేవాలయ గ్రేడ్–2 ఈవో సురేష్‌కుమార్‌రెడ్డి పర్యవేక్షణలో హుండీల ఆదాయాన్ని లెక్కించారు. ఆలయంలోని శాశ్వత హుండీల ద్వారా రూ.47,37,791, అన్నప్రసాద వితరణ సత్రంలోని హుండీ ద్వారా రూ.52,343 కలిపి పై మొత్తం వచ్చిందని సహాయ కమిషనర్ తెలిపారు. అలాగే మిక్స్‌డ్ బంగారు, వెండి ఆభరణాలు, 11 కువైట్ కాయిన్స్ వచ్చినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ వెంకటస్వామి, ప్రధాన, ఉప ప్రధాన, ముఖ్య అర్చకులు కేసరి, రాజారమేష్, రాజగోపాలాచార్యులు, ఆర్కే వ్యాలీ ఏఎస్‌ఐ నాగరాజు, ఆలయ సిబ్బంది, పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు.


