ట్యాంకర్‌ డ్రైవర్‌పై పోకిరీల దాడి | - | Sakshi
Sakshi News home page

ట్యాంకర్‌ డ్రైవర్‌పై పోకిరీల దాడి

Sep 12 2026 1:24 AM | Updated on Sep 12 2026 1:24 AM

గుర్రంకొండ : గుర్రంకొండ బస్టాండులో గురువారం రాత్రి ఘర్షణ జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. పాల ట్యాంకర్‌కు ఓ కారు అడ్డుగా వచ్చింది. పాలట్యాంకర్‌ రోడ్డుపై ఎందుకు ఉంచారంటూ డ్రైవర్‌పై కారులోని వ్యక్తులు వాగ్వాదానికి దిగారు. దీంతో వివాదం ఘర్షణకు దారి తీసింది. అప్పటికే పట్టణానికి చెందిన పలువురు పోకిరీలు ఘర్షణను పెద్దది చేయడంతో పాటు పాల ట్యాంకర్‌ డ్రైవర్‌పై దాడికి దిగారు. చాలా సేపు ఘర్షణ జరగడంతో ఎన్‌హెచ్‌ 340 జాతీయ రహదారిపై ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. ఈ విషయమై ఎస్‌ఐ రవీంద్రబాబును వివరణ కోరగా ఈ సంఘటనపై తమకు ఫిర్యాదు అందలేదన్నారు. బస్టాండులో నిత్యం ఇలా పొకిరీలు ఘర్షణలకు దిగి పలువురిపై దాడులకు పాల్పడటం పరిపాటిగా మారిందన్నారు. ఇప్పటికై నా పోలీసులు తగు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement