మదనపల్లె టౌన్ : వాటర్‌హీటర్‌తో నీళ్లు వేడి చేస్తుండగా కరెంట్ షాక్ తగిలి గర్భిణి తీవ్రంగా గాయపడిన సంఘటన శుక్రవారం గుర్రంకొండ మండలంలో చోటు చేసుకుంది. బాధితురాలి కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. చెర్లోపల్లెకు చెందిన మణికంఠ బొలెరో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఉదయం భర్త విధులకు వెళ్లేందుకు అతడి భార్య ప్రవల్లిక హీటర్ వేసి నీళ్లు వేడి చేసింది. నీళ్లు వేడయ్యాయో లేదో తెలుసుకునేందుకు చేత్తో తాకగా ఒక్కసారిగా విద్యుత్ షాక్ కొట్టింది. దీంతో ఆమె తీవ్రంగా గాయపడి కుప్పకూలింది. వెంటనే కుటుంబ సభ్యులు మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గర్భిణి కావడంతో వైద్యుల పర్యవేక్షణలో ఆమె కోలుకుంటోందని తెలిపారు.


