పెళ్లి భాజాలకు స్వల్ప విరామం | - | Sakshi
Sakshi News home page

పెళ్లి భాజాలకు స్వల్ప విరామం

Sep 12 2026 1:24 AM | Updated on Sep 12 2026 1:24 AM

అక్టోబర్‌ 11 నుంచి శుభ ముహూర్తాలు

మదనపల్లె సిటీ : వివాహాలు, శుభ కార్యక్రమాలకు తాత్కాలికంగా బ్రేక్‌ పడింది. భాద్రపద మాసం శూన్య మాసంగా పరిగణించడంతో అక్టోబర్‌ 10 వరకు 34 రోజులు పాటు శుభ ముహుర్తాలు ఉండవు. అక్టోబర్‌ 11 నుంచి తిరిగి వివాహాలు, గృహప్రవేశాలు, ఉపనయనాలు వంటి కార్యక్రమాలకు అనుకూలమైన ముహూర్తాలు ప్రారంభం కానున్నాయి. శ్రావణం, నిజ జ్యేష్ట మాసాల్లో భారీ సంఖ్యలో వివాహాలు జరగడంతో కళ్యాణ మండపాలు పెళ్లి సందడితో కళకళలాడాయి. వేద మంత్రాల సాక్షిగా వేలాది జంటలు ఒక్కటయ్యాయి.

నిశ్చితార్థాలు, గృహప్రవేశాలు, ఉపనయనాలు కూడా పెద్ద ఎత్తున జరిగాయి.

అక్టోబర్‌ 11 నుంచి సందడి

అక్టోబర్‌ 11 నుంచి డిసెంబర్‌ చివరి వరకు శుభముహుర్తాలు ఉన్నాయని వేద పండితులు చెబుతున్నారు. అక్టోబర్‌ 11, 14, 29, 30 తేదీలతో పాటు నవంబర్‌లో 5, 11 నుంచి 15 వరకు, 18 నుంచి 26 వరకు, డిసెంబర్‌లో 2, 3, 4, 10 నుంచి 13 వరకు, 15 నుంచి 19 వరకు, 22, 23, 27, 29 30, 31 తేదీల్లో వివాహాలు, ఇతర శుభకార్యాలకు ముహూర్తాలు ఉన్నాయని పేర్కొంటున్నారు. ఈ విరామ సయయంలో అన్నప్రాసన, అక్షరాభ్యాసం, నామకరణం, సీమంతాలు, రిజిస్ట్రేషన్లు వంటి కార్యాక్రమాలు మాత్రమే నిర్వహించవచ్చని పండితులు చెబుతున్నారు.

కల్యాణమండపం

భాద్రపదంలో శుభకార్యాలకు విరామం

భాద్రప్రద మాసంలో వినాయకచవితి, మహాలయపక్షం వంటి పర్వదినాలకు ప్రాధాన్యం ఉంటుంది. ఈ కాలంలో దేవతారాధన, పితృకార్యాలకు ప్రాముఖ్యత ఇస్తారు. వివాహాలు, గృహప్రవేశాలు వంటి శుభ కార్యాలు నిర్వహించరు. ఆశ్వీజ మాసం నుంచి తిరిగి శుభ ముహుర్తాలు ప్రారంభమవుతాయి.

– శివకుమార్‌శర్మ, వేదపండితులు, మదనపల్లె

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement