కారు ఢీకొని యువకుడికి తీవ్ర గాయాలు | - | Sakshi
Sakshi News home page

కారు ఢీకొని యువకుడికి తీవ్ర గాయాలు

Sep 12 2026 1:24 AM | Updated on Sep 12 2026 1:24 AM

మదనపల్లె టౌన్‌ : కారు ఢీకొని యువకుడు తీవ్రంగా గాయపడిన సంఘటన శుక్రవారం ములకలచెరువు మండలంలో జరిగింది. ఆసుపత్రి అవుట్‌ పోస్ట్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని వేపూరి కోట పంచాయతీ, ఆవులవారిపల్లికు చెందిన రెడ్డి ప్రసాద్‌ (23) ద్విచక్రవాహనంపై బురకాయలకోటకు వెళ్లాడు. పని ముగించుకుని తిరిగి స్వగ్రామానికి వెళుతుండగా మార్గమధ్యంలోని సెంట్రల్‌ స్కూల్‌ వద్ద కారు ఢీకొని తీవ్రంగా గాయపడ్డాడు. బాధితుడిని స్థానికుల సాయంతో 108 సిబ్బంది మదనపల్లి జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతున్నాడు.

ఘటనపై ములకలచెరువు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు మరిన్ని వివరాలను పోలీసులు వెల్లడించాల్సి ఉంది.

స్కూటర్‌ ఢీకొని ఫర్నిచర్‌ షాపు యజమానికి..

మదనపల్లె టౌన్‌ : ఫర్నిచర్‌ షాపు యజమానిని స్కూటర్‌ ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడిన సంఘటన గురువారం రాత్రి మదనపల్లెలో జరిగింది. ఘటనపై బాధితుడి కుటుంబీకులు తెలిపిన వివరాల మేరకు.. మండలంలోని సిటిఎంకు చెందిన రెడ్డప్ప(45) నీరుగట్టువారిపల్లె–పాతూరు మార్గంలో ఫర్నిచర్‌ షాపు నిర్వహిస్తున్నారు. రాత్రి షాపు మూసివేసి ఇంటికి వెళ్తుండగా, వేగంగా వచ్చిన ఓ స్కూటర్‌ ఆయనను ఢీకొట్టింది. ప్రమాదంలో రెడ్డప్ప తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే స్థానికులు బాధితుడిని జిల్లా ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రాత్రి వేళల్లో ఈ మార్గంలో వాహనాలు వేగంగా నడపడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement