మదనపల్లె టౌన్ : ఏపీలో ప్రస్తుత ఎకై ్సజ్ పాలసీని మరో ఏడాది పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని కడప ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ జయరాజ్, సీఐ భీమలింగ తెలిపారు. మదనపల్లెలో శుక్రవారం మద్యం దుకాణాల నిర్వాహకులతో నూతన పాలసీపై అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రస్తుతం ఉన్న అన్ని రిటైల్ మద్యం దుకాణాలను 100 శాతం రెన్యూవల్ చేయడమే ప్రధాన లక్ష్యమన్నారు. రెన్యూవల్ ప్రక్రియ మొత్తం ఏపిఎస్‌బిసిఎల్ ఆన్‌న్‌లైన్ పోర్టల్ ద్వారా డిజిటల్ విధానంలో జరుగుతుందని తెలిపారు. షాపులకు రేషనలైజేషన్ లేదా రీ లొకేషన్ ఉండదని, ప్రస్తుత అనుమతించబడిన ప్రాంగణంలోనే కొనసాగుతాయని స్పష్టం చేశారు. ఒకవేళ ఏ లైసెన్స్ రెన్యూవల్ చేయకపోతే కొత్త నోటిఫికేషన్ ద్వారా దరఖాస్తుదారులను ఆహ్వానిస్తారని, అయినా షాపు డిస్పోజ్ కాకపోతే నోటిఫైడ్ ఏరియాలో ఏపిఎస్‌బిసిఎల్ అవుట్‌లెట్ ఏర్పాటు చేస్తారన్నారు. ఫీజుల విషయానికొస్తే ఆర్‌ఈటిలో ఎలాంటి పెంపు లేదని, రెన్యూవల్ ఫీజు వార్షికంగా 38 శాతంగా నిర్ణయించారని చెప్పారు. చెల్లింపును 4 వాయిదాల్లో చేయవచ్చని, ఒక వాయిదాకు సమానమైన మొత్తానికి బ్యాంక్ గ్యారెంటీ ఇవ్వాలన్నారు. అన్ని విక్రయాలు పిఓసి ద్వారానే జరగాలని, మాన్యువల్ అమ్మకాలు నిషేధమని, సీసీటివీ నిరంతరం పనిచేయాలని, నిబంధనలు పాటించకపోతే భారీ జరిమానాలు, ఎమ్మార్పీ కంటే ఎక్కువకు అమ్మితే చట్టపరమైన చర్యలు తప్పవని వారు హెచ్చరించారు.


