బీసీ హాస్టల్‌ మూతబడటం ఖాయమే! | - | Sakshi
Sakshi News home page

బీసీ హాస్టల్‌ మూతబడటం ఖాయమే!

Sep 10 2026 1:27 AM | Updated on Sep 10 2026 1:27 AM

పెద్దతిప్పసముద్రం : స్థానికంగా ఉన్న బీసీ బాలుర వసతి గృహం మూతబడటం ఖాయమైంది. ఈమేరకు సీఎంవో ఆదేశాల మేరకు జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు స్థానిక ఎంపీపీ మహమూద్‌కు స్పష్టం చేస్తూ ఉత్తర్వులు పంపారు. వివరాల్లోకి వెళితే .. స్థానికంగా ఉండే బీసీ హాస్టల్‌లో పరిసర ప్రాంతాలతో పాటు చుట్టుపక్క మండలాలు, పక్క జిల్లాలకు చెందిన 34 మంది నిరుపేద విద్యార్థులు చదువుకుంటున్నారని బీసీ హాస్టల్‌ మూసేయకుండా ఇక్కడే కొనసాగించాలని కోరుతూ ఎంపీపీ మహమూద్‌ ఇటీవల సీఎంవో కార్యాలయానికి రిజిస్ట్రర్‌ పోస్టు ద్వారా లేఖ పంపారు. సదరు లేఖను పరిశీలించిన సీఎంవో అధికారుల ఆదేశాల మేరకు సంభంధిత జిల్లా అధికారులు స్పందించారు. రాష్ట్ర వ్యాప్తంగా విధ్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్న 54 బీసీ హాస్టళ్లను మార్పు చేస్తున్నామని.. ఇందులో భాగంగా అన్నమయ్య జిల్లాలో 10 హాస్టళ్లను మార్పు చేసి వారికి ప్రత్యామ్నాయంగా రాయచోటి లోని మహాత్మా జ్యోతిభా పూలే బీసీ రెసిడెన్షియల్‌ స్కూల్‌లో వసతి సౌకర్యం కల్పిస్తామని స్పష్టం చేస్తూ ఎంపీపీకి పంపిన ఉత్తర్వులో అధికారులు పేర్కొన్నారు. దీంతో పీటీఎం హాస్టల్‌ త్వరలోనే మూతబడటం ఖాయమని తేటతెల్లమైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement