రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

Sep 9 2026 2:58 AM | Updated on Sep 9 2026 2:58 AM

వాల్మీకిపురం : రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన సంఘటన మండలంలోని టేకలకోన వద్ద జాతీయ రహదారిపై మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని తాటిగుంటపల్లికి చెందిన గుండ్లూరి రత్నయ్య (65) కూలి పనుల నిమిత్తం కలికిరికి వెళ్లాడు. మంగళవారం సాయంత్రం కూలీ పనులు ముగించుకొని కలికిరి సమీపంలోని టేకలకోన జాతీయ రహదారి వద్ద రోడ్డు దాటుతుండగా మదనపల్లి వైపు నుంచి తిరుపతికి వెళ్తున్న కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన రత్నయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు ఎస్‌ఐ తిప్పేస్వామి తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ద్విచక్ర వాహనం

ఢీకొని..

ములకలచెరువు : ద్విచక్రవాహనం ఢీకొనడంతో ఒక వ్యక్తి మృతి చెందిన సంఘటన మండలంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు... మండలంలోని రాగిమానుపల్లెకు చెందిన వెంకటరామయ్య సోమవారం ఉదయం కూలిపనులకు వెళ్లాడు. రాత్రి ఇంటికి నడుచుకుంటూ వెళ్తుండగా తంబళ్లపల్లె క్రాస్‌ రోడ్డు వద్ద వెనకల నుంచి అతివేగంగా వచ్చిన ద్విచక్రవాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వెంకటరామయ్య(38)కు తీవ్రగాయాలయ్యాయి. గమనించిన స్థానికులు 108 సహాయంతో మదనపల్లె ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించి చికిత్స చేయిస్తుండగా మంగళవారం మృతిచెందాడు. మృతుడికి భార్య భార్గవి, కుమారుడు నితీష్‌కుమార్‌, కుమార్తె హితాన్షి ఉన్నారు. మృతుడు పీటీయం మండలం ఉప్పరోళ్లపల్లె నివాసి. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ధర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ ఉమామహేశ్వర్‌రెడ్డి తెలిపారు.

జేసీబీ చోరీ కేసులో

నిందితుడికి జైలు

మదనపల్లె టౌన్‌ : జేసీబీ చోరీ కేసులో నేరం రుజువు కావడంతో నిందితుడికి ఆరు నెలల సాధారణ జైలు శిక్ష, రూ.2 వేల జరిమానా విధిస్తూ మదనపల్లె ప్రిన్సిపల్‌ జ్యుడీషియల్‌ ఫస్ట్‌ క్లాస్‌ మెజిస్ట్రేట్‌ సుభహాన్‌ తీర్పు వెలువరించారు. టూటౌన్‌ పోలీసులు మంగళవారం తెలిపిన వివరాల మేరకు.. మదనపల్లె పట్టణంలోని జీఆర్టీ జ్యువెలర్స్‌ ఎదురుగా ఉన్న నాదెళ్ల రమేష్‌ అండ్‌ బ్రదర్స్‌ ఆల్‌ ఎర్త్‌ మూవర్స్‌ కార్యాలయం వద్ద 2023లో జేసీబీ చోరీకి గురైంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టి.. నిమ్మనపల్లె మండలం జాండ్రబైలుకు చెందిన ఎం.రెడ్డి శేఖర్‌ను నిందితుడిగా గుర్తించి అరెస్టు చేశారు. ఈ కేసు విచారణలో నేరం రుజువు కావడంతో మదనపల్లె కోర్టు నిందితుడికి ఆరు నెలల సాధారణ జైలు శిక్షతోపాటు రూ.2,000 జరిమానా విధించింది. ప్రాసిక్యూషన్‌ తరఫున సీనియర్‌ ఏపీపీ సి.కృష్ణారెడ్డి వాదనలు వినిపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement