ఘర్షణకు దారి తీసిన భూ వివాదం | - | Sakshi
Sakshi News home page

ఘర్షణకు దారి తీసిన భూ వివాదం

Sep 9 2026 2:58 AM | Updated on Sep 9 2026 2:58 AM

గుర్రంకొండ : భూ వివాదంలో ఘర్షణ చెలరేగి యువకుడిపై ప్రత్యర్థులు దాడి చేయడంతో తీవ్ర గాయాలు అయిన సంఘటన మండలంలోని ఎల్లుట్లపంచాయతీ ఇ. పసలవాండ్లపల్లెలో జరిగింది. గ్రామానికి చెందిన మణికంఠ, రవీంద్ర కుటుంబాలకు గత కొన్నేళ్లుగా భూవివాదం నెలకొంది. ఈ నేపథ్యంలో మణికంఠకు చెందిన విద్యుత్‌ మోటార్‌ స్టార్టర్‌ను తీసుకెళ్లిపోయారు. ఈ విషయమై మంగళవారం గ్రామంలో ఇరువర్గాల వారు వాగ్వివాదానికి దిగారు. వివాదం పెద్దదై ఘర్షణ పడ్డారు. ప్రత్యర్థులు మణికంఠ(35)పై దాడి చేయడంతో తలపైన, చేతిపైన తీవ్ర గాయాలు అయ్యాయి. కుటుంబ సభ్యులు బాధితుడిని చికిత్స నిమిత్తం వాల్మీకిపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ రవీంద్ర తెలిపారు.

ఎంబీబీఎస్‌ కౌన్సెలింగ్‌లో గందరగోళం

కలికిరి : ప్రభుత్వం విడుదల చేసిన జీఓ నంబరు 102తో ఎంబీబీఎస్‌ కౌన్సెలింగ్‌లో గందరగోళం నెలకొందని వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం జిల్లా ఉపాధ్యక్షుడు ఎం.నరేష్‌ అన్నారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ మెరిట్‌ విద్యార్థులతోపాటు ఎస్సీ, ఎస్సీ, బీసీ, మైనార్టీ వర్గాల వైద్య విద్యార్థులకు ఎలాంటి నష్టం జరగకుండా ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఒకే కళాశాలలో, ఒకే రిజర్వేషన్‌ కేటగిరీలో తక్కువ ర్యాంకు అభ్యర్థికి కాకుండా ఎక్కువ ర్యాంకు సాధించిన విద్యార్థులకు సీట్లు కేయించడం పలు విమర్శలకు దారి తీసిందని, దీనిపై ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపి అర్హులైన వైద్య విద్యార్థులకు న్యాయం జరిగేలా చూడాలని, లేని పక్షంలో వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో ఉద్యమిస్తామన్నారు. కార్యక్రమంలో పలువురు విద్యార్థి సంఘం నేతలు పాల్గొన్నారు.

ఆన్‌లైన్‌ మట్కా బీటర్‌ అరెస్ట్‌

ప్రొద్దుటూరు క్రైం : ఆన్‌లైన్‌లో మట్కా జూదం నిర్వహిస్తున్న వ్యక్తిని ప్రొద్దుటూరు వన్‌టౌన్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. నడింపల్లె ప్రాంతానికి చెందిన షేక్‌ మహబూబ్‌బాషా ఆన్‌లైన్‌లో మట్కా నిర్వహిస్తున్నట్లు గుర్తించిన వన్‌టౌన్‌ ఎస్‌ఐ మైనుద్ధిన్‌ మంగళవారం అరెస్ట్‌ చేశారు. అతని వద్ద నుంచి రూ.7 వేలు నగదు, మొబైల్‌ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.

యువకుడికి తీవ్ర గాయాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement