‘ఏఐ’ ప్రకృతి నాడి పట్టేస్తోంది | - | Sakshi
Sakshi News home page

‘ఏఐ’ ప్రకృతి నాడి పట్టేస్తోంది

Sep 9 2026 2:58 AM | Updated on Sep 9 2026 2:58 AM

భూమిపై మార్పులను పసిగట్టే అంతరిక్ష నేత్రం

మిట్స్‌లో ప్రముఖ సైంటిస్టులు

కురబలకోట : వరద ఎప్పుడు వస్తుంది.. నీటిని ఎలా నిల్వ చేయాలి.. ఎప్పుడు విడుదల చేయాలి.. ఏ ప్రాంతంలో నీటి కొరత ఉంది.. కరువు ఎప్పుడు రాబోతోంది.. భూమిపై పర్యావరణంలో ఎలాంటి మార్పులు చోటుచేసుకుంటున్నాయి.. ఇలాంటి కీలక విషయాలను ముందుగానే పసిగట్టడంలో ఆర్టిపిషియల్‌ ఇంటిలెజెన్స్‌ (ఏఐ), అంతరిక్ష సాంకేతికతలు కీలక ఆయుధాలుగా మారుతున్నాయని ప్రముఖ సైంటిస్టులు పేర్కొన్నారు. మంగళవారం అంగళ్లులోని మిట్స్‌ యూనివర్సిటీలో ఏఐ, అంతరిక్ష సాంకేతికతలతో వాతావరణ మార్పులు, సహజ వనరుల పర్యవేక్షణ అంశంపై రెండు రోజులు నిర్వహించిన వర్క్‌షాపులో మంగళవారం ఐఐఎస్సీ బెంగళూరు ప్రొఫెసర్‌ డాక్టర్‌ డి.నగేష్‌కుమార్‌, ఇస్రో శాస్త్రవేత్త డాక్టర్‌ కందుల వి.సుబ్రమణ్యం, గాదంకి ఎన్‌ఏఆర్‌ ఎల్‌ శాస్త్రవేత్త డాక్టర్‌ జ్యోతి నారాయణన్‌ భాటే ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. డి.నగేష్‌కుమార్‌ మాట్లాడుతూ నీటి నిర్వహణలో ఏఐ భవిష్యత్తును మార్చబోతోందన్నారు. వరదలు, నీటి కొరతను ముందుగానే అంచనా వేసే అవకాశాలు విస్తరిస్తున్నాయన్నారు. రిజర్వాయర్లలో నీటి నిల్వ, విడుదల, సాగు నీటి సరఫరా నిర్వహణ, వరద నియంత్రణలో ఏఐ ఆధారిత సమాచారం కీలక నిర్ణయాలకు దోహదపడుతుందన్నారు. ఇస్రో శాస్త్రవేత్త కందుల సుబ్రమణ్యం, మరో శాస్త్రవేత్త జ్యోతి నారాయణ్‌ భాటే మాట్లాడుతూ అంతరిక్షం నుండి భూమిని గమనిస్తూ ఏఐతో ఆ సమాచారాన్ని విశ్లేషించడం ద్వారా ప్రకృతిలో వస్తున్న మార్పులను వేగంగా గుర్తించే శకం మొదలైందన్నారు. ఏఐ నమూనాలతో సహజ వనరుల పరిస్థితిని సమర్థవంతంగా పర్యవేక్షించవచ్చన్నారు. అంతరిక్ష సాంకేతిక అంటే కేవలం రాకెట్లు, ఉపగ్రహాలకే పరిమితం కాదన్నారు. నీరు, వాతావరణం, వ్యవసాయం, సహజ వనరులు, విపత్తుల నిర్వహణ వరకు సామాన్యుడి జీవితాన్ని ప్రభావితం చేసే శక్తిగా స్పేస్‌ టెక్నాలజీ విస్తరిస్తోందన్నారు. ఆర్‌ఏరోస్పేస్‌ బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ మేనేజర్‌ సుభాష్‌ ఆర్‌. కుప్పుస్వామి మాట్లాడుతూ అంతరిక్ష రంగంలో స్పేస్‌ బిజినెస్‌, ఉన్నత విద్య, ఉద్యోగ, కేరీర్‌ అవకాశాలు మెండుగా ఉన్నాయన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement