వైభవంగా అంకురార్పణ | - | Sakshi
Sakshi News home page

వైభవంగా అంకురార్పణ

Aug 18 2026 12:09 AM | Updated on Aug 18 2026 12:09 AM

వాల్మీకిపురం : శ్రీరామ పట్టాభిషేక మహోత్సవాలు సోమవారం సాయంత్రం అంకురార్పణతో అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉదయం స్వామివారికి సుప్రభాత సేవతో కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. సాయంత్రం టీటీడీ వేదపండితుల మంత్రోచ్ఛరణల నడుమ శ్రీ కలశ స్థాపన, హోమాది కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు.

దరఖాస్తుల ఆహ్వానం

బి.కొత్తకోట(పెద్దతిప్పసముద్రం) : మండలంలోని అచ్చమ్మకోట, గుడుపల్లిలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో అకడమిక్‌ ఇన్‌స్ట్రక్టర్ల నియామకం కోసం ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని ఎంఈఓ రెడ్డిశేఖర్‌ సూచించారు. దరఖాస్తుదారులు డీఈడీ, బీఈడీ పూర్తి చేసి టెట్‌ ఉత్తీర్ణత సాధించి ఉండాలని పేర్కొన్నారు. ఈ నెల 21 లోపు దరఖాస్తు చేసుకోవచ్చని ఎంఈఓ సూచించారు.

మదనపల్లెకు

రెగ్యులర్‌ కార్యదర్శి

సాక్షి, మదనపల్లె :కొన్నేళ్ల తర్వాత ఎట్టకేలకు మదనపల్లె వ్యవసాయ మార్కెట్‌ యార్డుకు రెగ్యులర్‌ కార్యదర్శిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇన్చార్జి కార్యదర్శుల పాలనలో నెలకొన్న పరిస్థితులపై ఈ నెల నాలుగో తేదీ ‘సాక్షి’లో ఇన్చార్జిల పాలన ఆదాయానికి పాతర శీర్షికన కథనం ప్రచురితమైంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వంపుత్తూరులో పనిచేస్తున్న బి.తులసీరామ్‌ను ప్రమోషన్‌పై మదనపల్లె మార్కెట్‌ కార్యదర్శిగా నియమించారు.

సమస్యలపై పరిష్కారంలో ప్రభుత్వం విఫలం

సాక్షి, మదనపల్లె : బి.కొత్తకోట నగర పంచాయతీలో నెలకొన్న సమస్యల పరిష్కారంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని సిపిఐ జిల్లా కార్యదర్శి పి.మహేష్‌, సహాయ కార్యదర్శి టీ.కృష్ణప్పలు విమర్శించారు. సోమవారం నగర పంచాయతీ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. సమస్యలు పరిష్కరించి, అభి వృద్ధి పనులు చేపట్టాలని నినాదాలు చేశారు. నియోజకవర్గ కార్యదర్శి ఎస్‌.మనోహర్‌ రెడ్డి, మండల కార్యదర్శి జి.రఘునాథ్‌ మాట్లాడారు. అనంతరం 41 సమస్యల వినతి పత్రాన్ని కమిషనర్‌ రమాదేవికి అందజేశారు. సిపిఐ నాయ కులు ఎం.అష్రఫ్‌ అల్లి, ఎస్‌.తంబయ్యశెట్టి, హెచ్‌.షమీవుల్లా, సలీం భాష, వేణుగోపాల్‌ రెడ్డి, పి.మంజునాథ్‌, ఎం. గంగులప్ప తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement