సర్‌జీ.. తీసుకో అర్జీ! | - | Sakshi
Sakshi News home page

సర్‌జీ.. తీసుకో అర్జీ!

Aug 18 2026 12:09 AM | Updated on Aug 18 2026 12:09 AM

పీజీఆర్‌ఎస్‌కు వెల్లువెత్తుతున్న అర్జీలు పరిష్కారం కాని సమస్యలు

మదనపల్లి (కురబలకోట) : చేతిలో అర్జీ.. కళ్లలో ఆశ.. సమస్య పరిష్కారమవుతుందో లేదోనని మనసు మూలన దిగులు.. ప్రతి సోమవారం కలెక్టరేట్‌లో జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చే బాధితుల హావభావాలు ఇవి.. ఎప్పట్లాగే ఈ వారం కూడా జిల్లా నలుమూలల నుంచి వివిధ సమస్యలపై పెద్ద సంఖ్యలో అర్జీదారులు తరలి వచ్చారు. పీజీఆర్‌ఎస్‌ అర్జీపై ఉన్నతాధికారి పెట్టే చిన్న సంతకం కోసం జిల్లా నలుమూలల నుంచి వ్యయ ప్రయాసలతో పాటు సమయాన్ని వెచ్చించి మరీ వస్తున్నారు. అయినా ఆశించిన స్థాయిలో సమస్యలు పరిష్కారం కావడం లేదని అర్జీదారులు వాపోతున్నారు. ఈ వారం పీజీఆర్‌ఎస్‌కు 347 అర్జీలు వచ్చినట్లు ఇన్‌చార్జి జిల్లా కలెక్టర్‌ శివ్‌ నారాయణ శర్మ తెలిపారు. సబ్‌ కలెక్టర్‌ చల్లా కల్యాణి తదితరులు అర్జీలు స్వీకరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement