సాక్షి, మదనపల్లె : నియోజకవర్గంలో సర్ ప్రక్రియ అనంతరం పోలింగ్ కేంద్రాల వారీగా ఓటర్ల జాబితాల్లో జరిగిన ఓటర్ల గందరగోళంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త ఎస్.నిసార్ అహ్మద్ సోమవారం కలెక్టరేట్‌లో ఇంచార్జ్ కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై ఆయన మాట్లాడుతూ ఒక పోలింగ్ కేంద్రంలోని ఓటర్లను మరో పోలింగ్ కేంద్రానికి మార్చారని చెప్పారు. ఒక కుటుంబంలోని సభ్యులు వేర్వేరు కేంద్రాల్లో ఓటర్లు మారిపోయినట్టు చెప్పారు. దీనివల్ల తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. సర్‌కు సంబంధించి నోటీసులు అందుకున్న 20వేల మంది ఓటర్లను బూత్ లెవల్ అధికారులు భౌతికంగా హాజరుకావాలని కోరుతున్నారని, దూర ప్రాంతాల్లో నివసిస్తున్న ఓటర్లు హాజరుకాలేని పరిస్థితులు నెలకొన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. నాయకులు వీఎస్ రెడ్డి, నవాజ్ అలీ ఖాన్, మల్లికార్జున రెడ్డి, నాగార్జున నాయుడు, బయ్యా రెడ్డి, చెన్నకృష్ణ, చలపతి ఉన్నారు.
గ్రీవెన్స్‌సెల్‌లో నిసార్ అహ్మద్ ఫిర్యాదు


