ఏనుగు సంచారంతో అప్రమత్తం | - | Sakshi
Sakshi News home page

ఏనుగు సంచారంతో అప్రమత్తం

Aug 13 2026 1:09 AM | Updated on Aug 13 2026 1:09 AM

విద్యా ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఐక్య ఉద్యమం

సదుం: మండల సరిహద్దులోని అటవీ ప్రాంతంలో బుధవారం ఒంటరి ఏనుగు సంచారాన్ని గుర్తించామని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ అధికారులు సూచించారు. చీకలచేను కుంటలు ప్రాంతంలో ఏనుగు సంచారాన్ని గుర్తించినట్లు వారు పేర్కొన్నారు. చీకలచేను, గాదేవారిపల్లె, నాయనవారిపల్లె వైపుకు ఏనుగు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. రాత్రి వేళల్లో ఆ మార్గాలలో ప్రయాణించరాదని హెచ్చరించారు.

డీఈఈసెట్‌ రెండో దశ వెబ్‌ఆప్షన్ల నమోదుకు అవకాశం

రాయచోటి : ప్రభుత్వ, ప్రైవేట్‌ డీఎల్‌ఎడ్‌ కళాశాలల్లో మిగిలిన ఖాళీ సీట్ల భర్తీ కోసం ఈ నెల 13 నుంచి 16వ తేదీ వరకు రెండవ దశ వెబ్‌ ఆధారిత ఆప్షన్ల నమోదుకు అవకాశం కల్పించినట్లు రాయచోటి డైట్‌ ఇన్‌చార్జ్‌ ప్రిన్సిపల్‌ మడి తాటి నరసింహారెడ్డి తెలిపారు. బుధవారం డైట్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రెండవ దశలో అభ్యర్థులు నమోదు చేసిన వెబ్‌ ఆప్షన్ల ఆధారంగా ఈ నెల 17 నుంచి 20వ తేదీల వరకు సీట్ల కేటాయింపు ప్రక్రియ నిర్వహించడం జరుగుతుందని చెప్పా రు. ఏపీ డిప్లమో ఇన్‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌లో అర్హత సాధించిన అభ్యర్థులు మొదటి దశ కౌన్సెలింగ్‌ తర్వాత రెండవ దశ కౌన్సెలింగ్‌ చేపట్టామన్నారు. సమావేశంలో డైట్‌ అధ్యాపకులు మార్ల ఓబుల్‌రెడ్డి, వెంకటసుబ్బారెడ్డి, వైసీ రెడ్డప్పరెడ్డి, గిరిబాబుయాదవ్‌, మహమ్మద్‌ ఇలియాస్‌, కలీముల్లా, ఉషా మాధురి, నిర్మల తదితరులు పాల్గొన్నారు.

24 నుంచి రాష్ట్రస్థాయి పోటీలు

కడప వైఎస్‌ఆర్‌ సర్కిల్‌ : ఈనెల 24 నుంచి 27 వరకు తిరుపతిలో అమరావతి ఛాంపియన్‌ షిప్‌–2026 రాష్ట్ర స్థాయి పోటీలను నిర్వహించనున్నారని డీఎస్‌డీఓ గౌస్‌బాషా బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటికే 12 క్రీడాంశాలలో అండర్‌ 17, 23 బాలబాలికలకు నియోజకవర్గ, జిల్లాస్థాయి ఎంపికలను చేపట్టామన్నారు. జిల్లాస్థాయిలో ఎంపికైన క్రీడాకారులు పైన తెలిపిన తేదీల్లో పాల్గొనాల్సి ఉంటుందని వివరించారు.

16న చెస్‌ టోర్నమెంట్‌

కడప వైఎస్‌ఆర్‌ సర్కిల్‌: ఈ నెల 16న నగరంలోని ఇంటర్నేషనల్‌ డిల్లీ పబ్లిక్‌ స్కూల్‌లో అనీస్‌ దర్బారి చెస్‌ అకాడమీ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఓపెన్‌ ప్రైజ్‌ మనీ చెస్‌ టోర్నమెంట్‌ నిర్వహించనున్నట్లు టోర్నమెంట్‌ డైరెక్టర్‌ శ్రీమతి తబస్సుం బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ టోర్నమెంట్‌కు మొత్తం రూ.55 వేలు నగదు బహుమతులు ఉంటాయన్నారు. వివరాలకు 9030292116 సంప్రదించాలని కోరారు.

ప్రయాణికులకుమెరుగైన సేవలు అందిస్తాం

కడప కోటిరెడ్డి సర్కిల్‌ : కడప ఆర్టీసీ జోన్‌లో ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందు కు కృషి చేస్తున్నామని కడప జోన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ కిశోర్‌ తెలిపారు. బుధవారం కడప బస్టాండు సమీపంలో ఉన్న ఆర్టీసీ కార్గో పాయింట్‌, బస్టాండులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. కార్గో పాయింట్లలో బుకింగ్‌ చేసుకున్న కస్టమర్లతో ఆయన మాట్లాడారు. ఏవైనా సమస్యలుంటే తమ దృష్టికి తీసుకరావాలని ఆయన కోరారు.

కడప సెవెన్‌ రోడ్స్‌ : విద్యా రంగ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఐక్య ఉద్యమాన్ని చేపట్టాల్సిన అవసరం ఉందని ఏఎస్‌వైఎఫ్‌ఓ రాష్ట్ర అధ్యక్షుడు ఓబయ్య అన్నారు. బుధవారం కడప నగరంలోని పద్మశ్రీ ఓకేషనల్‌ జూనియర్‌ కళాశాలలో నిర్వహించిన ఏఎస్‌వైఎఫ్‌ రాష్ట్ర మొదటి మహా సభలో ఆయన మాట్లాడుతూ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విద్యార్థులు ఉద్యమించాలని కోరారు. అంబేద్కర్‌ ఆలోచనా విధానాన్ని ఆదర్శంగా తీసుకుని దేశాభివృద్ధిలో విద్యార్థులు కీలక పాత్ర పోషించాలన్నారు. పీఎస్‌యూ రాష్ట్ర కార్యదర్శి కె. సుబ్బారాయుడు, పీఆర్‌ఎస్‌వైఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి శంకర్‌, ఏఐబీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు జగన్‌ రాథోడ్‌ మాట్లాడుతూ ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల విద్య అనేది అంగడి సరుకుగా మారిందన్నారు. విద్యను వ్యాపారంగా మార్చే ప్రైవేటీకరణ విధా నాలను వ్యతిరేకించాలని, ప్రతి విద్యార్థికి సమానంగా నాణ్యమైన విద్య అందేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. పెండింగ్‌ లో వున్నా ఫీజు బకాయిలు, సంక్షేమ హాస్టల్‌ విద్యార్థుల మెస్‌ ఛార్జిలను ధరలకు అనుగుణగా పెంచాలని డిమాండ్‌ చేశారు. పీఎఆర్‌ఎస్‌వైఎఫ్‌ జిల్లా అధ్యక్షులు ఓరుగంటి నాగేంద్ర బాబు, ఏఎస్‌వైఎఫ్‌ నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement