అసలు ఏంటిది ఐవీఎఫ్?
బద్వేలు: బంగారు సంతతీ.. బంగారు సంతతీ.. అంటూ దశాబ్దాల క్రితం ప్రతి ఇంటా మారుమోగిన పాటలు.. నేటి తరం దంపతుల జీవితాల్లో కన్నీటి ఆవేదనగా మారుతున్నాయి. కాలం, జీవనశైలి మారడంతో నేడు సంతానం కలగడం అంత సులభంగా లేదు. ఉమ్మడి వైఎస్సార్ కడప జిల్లావ్యాప్తంగా సంతానలేమి సమస్యతో బాధపడే దంపతుల సంఖ్య రోజురోజుకూ వేగంగా పెరుగుతోంది. ఒకప్పుడు వంద మందిలో కేవలం ఒకరిద్దరు మాత్రమే ఈ సమస్యతో బాధపడేవారు. కానీ ఇప్పుడు ఆ సంఖ్య ఏకంగా 20 శాతం దాటినట్లు వైద్య గణాంకాలు చెబుతున్నాయి. కాగా సంతాన సాఫల్య కేంద్రాలకు ఒకప్పుడు హైదరాబాద్, చైన్నె, బెంగళూరు వంటి మహానగరాలు మాత్రమే పుట్టినిల్లుగా ఉండేవి. కానీ దూరప్రాంతాలకు వెళ్లలేని నిరుపేద, మధ్యతరగతి బాధితుల అవసరాలను ఆసరాగా చేసుకుని.. ఇప్పుడు మన జిల్లాలోనే పదుల సంఖ్యలో సంతాన సాఫల్య కేంద్రాలు వెలిశాయి. ముఖ్యంగా జిల్లా కేంద్రమైన కడపతో పాటు ప్రొద్దుటూరు పట్టణాల్లోనే 10 కి పైగా ఫెర్టిలిటీ కేంద్రాలు ఏర్పాటయ్యాయి. ఈ కేంద్రాల్లో ప్రస్తుతం ప్రతిరోజూ 30 నుంచి 40 మంది దాకా మహిళలు సంతానం కోసం ప్రత్యేక చికిత్సల నిమిత్తం వస్తున్నారు.
సంతానలేమికి ప్రధాన కారణాలు ఇవే..
చాలామంది జీవితంలో స్థిరపడ్డాకే వివాహం చేసుకోవాలని 30 నుంచి 40 ఏళ్ల వయస్సు వచ్చినా పెళ్లిళ్లు వాయిదా వేసుకోవడం. సంతానలేమికి ప్రధాన కారణం. శారీరక శ్రమ లేదా వ్యాయామం అస్సలు లేకపోవడం, శృతిమించుతున్న స్థూలకాయం..మహిళల్లో అండాశయంలో నీటి బుడగలు లేదా తిత్తులు ఏర్పడటం, రాత్రివేళల్లో మొబైల్ ఫోన్లు ఎక్కువగా చూడటం వల్ల ఆలస్యంగా నిద్రపోవడం, పిజ్జాలు, బర్గర్ల లాంటి జంక్‌ఫుడ్‌ను విపరీతంగా తీసుకోవడం కూడా ఇందుకు కారణాలు.
ఐవీఎఫ్ ఎప్పుడు అవసరమవుతుంది?
సంతానం కలగని వారందరికీ ఐవీఎఫ్ అవసరం లేదు. ముందుగా వైద్యులు సహజ సిద్ధంగా గర్భం ధరించేలా చికిత్స అందిస్తారు. ఆ మార్గాలన్నీ విఫలమై, సహజ సిద్ధంగా గర్భధారణకు అస్సలు అవకాశం లేని దంపతులకు మాత్రమే ఐవీఎఫ్ చికిత్స అవసరమవుతుంది. ఫెలోపియన్ నాళాలు పూర్తిగా మూసుకుపోయినప్పుడు, అండాశయ ట్యూబ్స్ బ్లాక్ అయినప్పుడు, అండకణాల సంఖ్య చాలా తక్కువగా ఉన్నప్పుడు అవసరం. ప్రాథమిక సంతాన సాఫల్య చికిత్స అయిన ఐయూఐ పదే పదే విఫలమైనప్పుడు, మహిళల్లో ఎక్కువసార్లు అబార్షన్లు అయినప్పుడు, క్యాన్సర్ బారిన పడిన రోగులకు అవసరం. మగవారిలో వీర్యకణాల నాణ్యత తక్కువగా ఉన్నప్పుడు లేదా పూర్తిగా కణాలు లేనప్పుడు ఐవీఎఫ్ అనివార్యమవుతుంది.
మారుతున్న జీవనశైలి, లేటు వయసు పెళ్లిళ్లు, జంక్‌ఫుడ్ సంస్కృతితో
దంపతుల్లో తీవ్రమవుతున్న
హార్మోన్ల అసమతుల్యత
ఉమ్మడి జిల్లాలో ఏకంగా 20 శాతం దాటిన సంతానలేమి బాధితులు
ఐవీఎఫ్ అంటే ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్. ఇది ఒక అత్యాధునిక సంతానోత్పత్తి చికిత్స విధానం. శారీరక లోపాల వల్ల గర్భధారణ సాధ్యం కానప్పుడు.. ఐవీఎఫ్ పద్ధతిలో సీ్త్ర శరీరం నుంచి అండాలను, పురుషుని నుంచి శుక్ర కణాలను వెలికితీస్తారు. సేకరించిన అండం, శుక్రకణాలను అత్యాధునిక ల్యాబొరేటరీలో శాసీ్త్రయంగా కలుపుతారు. అక్కడ ఫలదీకరణం చెంది విజయవంతంగా రూపాంతరం చెందిన పిండాన్ని మరల సీ్త్ర గర్భాశయంలోకి జాగ్రత్తగా ప్రవేశపెడతారు. ఇది విజయవంతంగా గర్భధారణకు దారితీస్తుంది.


