ఫిన్లాండ్‌ పర్యటనకు ఉపాధ్యాయురాలు ఎంపిక | - | Sakshi
Sakshi News home page

ఫిన్లాండ్‌ పర్యటనకు ఉపాధ్యాయురాలు ఎంపిక

Aug 12 2026 2:58 AM | Updated on Aug 12 2026 2:58 AM

ప్రొద్దుటూరు కల్చరల్‌ : ఫిన్లాండ్‌లో విద్యారంగపై శిక్షణ కోసం మండలానికి చెందిన ఉపాధ్యాయురాలు ఎంపికయ్యారు. పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ తమీమ్‌ అన్సారియా రాష్ట్ర వ్యాప్తంగా 25 మంది ఉపాధ్యాయులను శిక్షణకు ఎంపిక చేశారు. మండలంలోని లింగారెడ్డి నగర్‌ ఆదర్శ పాఠశాల ఉపాధ్యాయురాలు షేక్‌ జవహర్‌ మున్నీర్‌ ఈ శిక్షణకు ఎంపికయ్యారు. ఈ నెల 15న ఈమె ఫిన్లాండ్‌కు బయలుదేరి ఫిన్లాండ్‌లో 17వ తేదీ నుంచి 26వ తేదీ వరకు అక్కడి పాఠశాలల విద్యా విధానం, పనితీరు, విద్యాబోధన, అభ్యాస నైపుణ్యాలు తదితర అంశాలపై శిక్షణ పొందనున్నారు. అనంతరం అక్కడి విద్యావిధానాన్ని మన రాష్ట్రంలో అమలు చేయడంపై ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నారు. ఈమె 2025లో రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును అందుకున్నారు. ఆమెతోపాటు జిల్లాలోని కాశినాయన మండలానికి చెందిన బండి పరిమళజ్యోతి ఎంపికయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement