కత్తులతో పొడుచుకున్న బీటెక్‌ విద్యార్థులు | - | Sakshi
Sakshi News home page

కత్తులతో పొడుచుకున్న బీటెక్‌ విద్యార్థులు

Aug 12 2026 2:58 AM | Updated on Aug 12 2026 2:58 AM

మదనపల్లె టౌన్‌ : మదనపల్లెలో ఇద్దరు బీటెక్‌ విద్యార్థులు కత్తులతో పొడచుకున్న సంఘటన తీవ్ర కలకలం రేపింది. సోమవారం రాత్రి జరిగిన ఘటనపై ఆస్పత్రి ఔట్‌ పోస్టు పోలీసులు తెలిపిన వివరాలు.. పట్టణంలోని బొంబు బజారుకు చెందిన అమీర్‌ బాషా కుమారుడు ఆఫ్సాన్‌ (20), తాళ్లసుబ్బన్న కాలనీలో ఉంటున్న షమీవుల్లా కుమారుడు సాదిక్‌ (22), మిషన్‌ కాంపౌండ్‌ ఎదురుగా ఉన్న విశ్వహిత డిగ్రీ కళాశాలలో చదువుకుంటున్నారు. ఇద్దరు శేషమహల్‌కు దక్షిణం వైపున ఉన్న మడికయల్లోకి సరదాగా వెళ్లారు. అక్కడ ఏం జరిగిందో ఇద్దరూ గొడవ పడ్డారు. ఇద్దరు ముందుగానే వెంట తెచ్చుకున్న కత్తులతో పరస్పరం దాడులు చేసుకున్నారు. దాడుల్లో గాయపడిన బాధితులను స్థానికులు జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఘటనపై తాలూకా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మద్యం మత్తులో గొడవ పడ్డారా లేక వేరే కారణాలు ఉన్నాయా అనే అంశాలపై దర్యాప్తు చేస్తున్నామని తాలూకా సిఐ కళా వెంకటరమణ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement