నష్టాలు భరించ లేక మామిడి చెట్లు తొలగింపు | - | Sakshi
Sakshi News home page

నష్టాలు భరించ లేక మామిడి చెట్లు తొలగింపు

Aug 11 2026 12:36 AM | Updated on Aug 11 2026 12:36 AM

రొంపిచెర్ల : ప్రతి సంవత్సరం నష్టాలు తప్ప లాభాలు చూడలేక ఓ రైతు ఐదు ఎకరాల పొలంలో మామిడి చెట్లును తొలగించిన సంఘటన రొంపిచెర్ల మండలం బొమ్మయ్యగారిపల్లె గ్రామ పంచాయతీ కుమ్మరపల్లెలో చోటు చేసుకుంది. రైతు కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. కుమ్మరపల్లెకు చెందిన రైతు నాగరాజ 15 సంవత్సరాల క్రితం ఐదు ఎకరాల పొలంలో 350 తోతాపురి రకం మామిడి చెట్లు నాటారు. ప్రతి సంవత్సరం 20 టన్నుల మామిడి కాయల దిగుబడి వస్తుంది. అయితే మార్కెట్‌లో గిట్టుబాటు ధరలు లేక పోవడంతో చేసేదేమి లేక చెట్లను తొలగించాల్సి వచ్చిందన్నారు. ఈ ఏడాది టన్ను రూ.3000 ధర పలికిందన్నారు. గత ఏడాది మామిడి పంట కోసం కొట్టిన మందుల ఖర్చు కూడా రాలేదు. అందుకే బిడ్డలాంటి మామిడి చెట్లను నరికి వేశానని విలపించారు. రెండు సంవత్సరాలుగా ధరలు పూర్తిగా తగ్గి పోయ్యాయిని తెలిపారు. మామిడి చెట్లు తొలగించిన పొలంలో ఇతర వ్యవసాయ పంటలను పండించాలని నిర్ణయం తీసుకున్నట్లు రైతు నాగరాజ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement