● జగతికట్ట నుంచి కాకుండా...
ఏటిలో.నిర్మాణం
● 200 మీటర్ల దూరం నుంచి బ్రిడ్జి పనులు
● ఇలా నిర్మిస్తే భవిష్యత్తులో
వరదనీటి ముప్పు
రాజంపేట: నందలూరు చెయ్యేరు నదిపై హై లెవల్ వంతనె (బ్రిడ్జి) నిర్మాణం అంశం ఇప్పుడు వివాదంలో పడింది. జగతి కట్ట నుంచి కాకుండా పాతవంతెన ప్రకారం నిర్మాణం చేపట్టడం వల్ల ఈ పరిస్ధితి నెలకొంది.ఇలా నిర్మిస్తే భవిష్యత్తులో వరదనీటి ముప్పు వాటిల్లుతుందని స్ధానికులు వాపోతున్నారు.
దారితప్పిన బ్రిడ్జి నిర్మాణం..
చెయ్యేరు నదిపై గ్రీన్‌ఫీల్డ్ హైవే బ్రిడ్జి నిర్మాణ పనులు చేపట్టారు. కట్టపై నుంచి కాకుండా 200 మీటర్ల దూరంలో నిర్మాణ పనులు చెయ్యేరు నదిలో చేపట్టారు.బ్రిడ్జి నిర్మాణ వ్యవహారంపై స్ధానికంగా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. బ్రిడ్జి నిర్మాణంపై వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్ సిద్ధవరం గోపిరెడ్డి ఆధ్వర్యంలో స్ధానిక నాయకులు నిర్మాణ ప్రాంతాన్ని పరిశీలించారు. వంతెన నిర్మాణం దారితప్పినట్లుగా ఆరోపించారు.


