వ్యక్తి దారుణ హత్య | - | Sakshi
Sakshi News home page

వ్యక్తి దారుణ హత్య

Aug 8 2026 1:35 AM | Updated on Aug 8 2026 1:35 AM

సంబేపల్లె : మండల పరిధిలోని రెడ్డివారిపల్లె పంచాయతీకి చెందిన పాటూరి ఈశ్వరయ్య(50) అనే వ్యక్తి గురువారం రాత్రి హత్యకు గురయ్యాడు. పోలీసుల కథనం మేరకు దేవపట్లగ్రామం గంగన్నగారి ఇండ్ల సమీపంలోని రీ సర్వే చేస్తున్న క్రమంలో గుట్టలో ఓ వ్యక్తి పడి ఉన్నారని పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే సంఘటన స్థలానికి ఎస్‌ రవికుమార్‌ చేరుకున్నాడు. మృతుని దగ్గ ఉన్న ఆధార్‌ కార్డు ఆధారంగా ఈశ్వయ్యగా పోలీసులు గుర్తించారు. ఇతను తరచూ మద్యం తాగేవాడని తెలిపారు. గురువారం రాత్రి ఈ్వశ్వరయ్యతో మద్యం తాగించి, బండరాయితో తలపై కొట్టి, వయర్‌తో హత్య చేసినట్లు సంఘట స్థలంలో ఉన్న ఆధారాలను బట్టి పోలీసులు తెలిపారు. మృతుడు ఒంటరిగానే జీవిస్తుండే వాడని తెలిపారు. సంఘటన స్థలాన్ని రాయచోటి డీఎస్పీ కృష్ణమోహన్‌, ఇన్‌చార్జి సీఐ కృష్ణంరాజునాయక్‌ పరిశీలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement