మదనపల్లె టౌన్: రోడ్డు ప్రమాదంలో విద్యార్థిని తీవ్రంగా గాయపడిన సంఘటన శుక్రవారం మదనపల్లె మండలంలో జరిగింది. వివరాలు.. మండలంలోని కోటవారిపల్లెకు చెందిన గంగరాజు కుమార్తె హేమలత (14) మదనపల్లె కోటబడి మునిసిపల్ హైస్కూల్లో 9వ తరగతి చదువుతోంది. తన పినతండ్రి వెంట బైకులో మదనపల్లి లోనికోటబడి మున్సిపల్ హైస్కూల్ కు వస్తుండగా, బెంబకూరు రోడ్డు, గంగమ్మ గుడి మలుపు వద్ద బైకు అదుపుతప్పి పడి విద్యార్థిని హేమలత తీవ్రంగా గాయపడింది. స్థానికులు గమనించి బాధితురాలిని ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందించడంతో కోలుకుంటూ ఉంది.
చెట్టు పై నుంచి పడి..
మదనపల్లె టౌన్: ఇంటి నిర్మాణానికి అడ్డంగా ఉన్న అళ్ళనేరేడు చెట్టు కొమ్మలు రంపంతో కత్తిరించే క్రమంలో అదుపుతప్పి కింద పడి ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. శుక్రవారం మదనపల్లె కురవంకలో జరిగిన ఘటనపై వివరాలు.. మండలంలోని కొత్తపల్లి పంచాయతీ, రంగారెడ్డి కాలనీలో కాపురం ఉంటున్న రమేష్(45) చెట్లు కోసేందుకు పట్టణంలోని ఎగువ కురవంకకు వెళ్లాడు. అల్ల నేరేడు చెట్టు ఎక్కి కొమ్మలు కోస్తుండగా, ప్రమాదవశాత్తు కింద పడి తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు గమనించి బాధితుడిని జిల్లా ఆసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్సలు అందించిన ఆసుపత్రి అత్యవసర విభాగం డాక్టర్లు అతని పరిస్థితి ఆందోళనకరంగా ఉందని తిరుపతి రుయాకు రెఫర్ చేశారు. కేసు దర్యాప్తులో ఉందని తాలూకా పోలీసులు తెలిపారు.


