కురబలకోట: భారతీయ చేనేత వారసత్వాన్ని పరిరక్షించడంతో పాటు ఆధునిక సాంకేతిక పరిజ్ణానాన్ని చేనేత రంగానికి అనుసంధానం చేసి కార్మికుల జీవనోపాధిని మెరుగుపర్చాలని అంగళ్లులోని మిట్స్ యూనివర్సిటీ ఇండస్ట్రీ రిలేషన్స్ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ పీఎం, బాలాజీ కోరారు. చేనేత దినోత్సవం సందర్భంగా యూనివర్సిటీలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ దేశ సంస్కృతి, సంప్రదాయాలకు చేనేత కూడా ప్రతీకగా నిలచిందన్నారు. ఈ గొప్ప వారసత్వాన్ని భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ముఖ్యంగా ఏఐ,డిజిటల్ సాంకేతికత వంటి అదునిక ఆవిష్కరణలను చేనేత రంగంలో వినియోగించడం ద్వారా ఉత్పత్తి, మార్కెటింగ్, విక్రయాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకు రావచ్చన్నారు. యువ ఇంజినీర్లు డిజైన్, డిజిటల్ మార్కెటింగ్, మార్కెట్ విస్తరణ వంటి రంగాల్లో సాంకేతిక పరిష్కారాలు అందించి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తీసుకు రావాలని డాక్టర్ బీ. అనిత అన్నారు.


