చేనేతకు ఉద్యమ చరిత్ర | - | Sakshi
Sakshi News home page

చేనేతకు ఉద్యమ చరిత్ర

Aug 8 2026 1:35 AM | Updated on Aug 8 2026 1:35 AM

డీఆర్‌ఓ వెంకటేష్‌

సాక్షి, మదనపల్లె: చేనేతకు స్వాతంత్య్ర చరిత్ర ఉందని జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేష్‌ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో జరిగిన చేనేత దినోత్సవం సందర్భంగా నేతన్న సేవలో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చేనేత రంగం భారత స్వాతంత్య్ర ఉద్యమంతో ముడిపడి ఉన్న గొప్ప వారసత్వమన్నారు. మహాత్మా గాంధీ పిలుపునిచ్చిన స్వదేశీ వస్త్రాలను ధరించండి–విదేశీ వస్త్రాలను బహిష్కరించండి నినాదం స్వాతంత్య్ర ఉద్యమంలో చేనేత రంగం కీలక పాత్ర పోషించిందని అన్నారు. ఎమ్మెల్యే షాజహాన్‌ బాషా మాట్లాడారు. అనంతరం జిల్లాలో 3,869 మంది లబ్ధిదారులకు నేతన్న సేవలో పథకం కింద రూ.9.67 కోట్ల ఆర్థిక సహాయం చెక్కును లబ్ధిదారులకు అందించారు. వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ శివరామ్‌, చేనేత శాఖ అధికారి పవన్‌ కుమార్‌, చేనేత సంఘ నాయకులు నీలకంఠ, సిద్ధప్ప,హరికృష్ణ, సత్యం పురుషోత్తం, నరసింహ, వివిధ మహిళా సంఘాల ప్రతినిధులు, చేనేత ,జౌళి శాఖ అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement