రెడ్డెమ్మ ఆలయం.. భక్తజన సందోహం | - | Sakshi
Sakshi News home page

రెడ్డెమ్మ ఆలయం.. భక్తజన సందోహం

Jul 27 2026 1:42 AM | Updated on Jul 27 2026 1:42 AM

ఉత్సాహంగా క్రికెట్‌ ఎంపికలు

గుర్రంకొండ: మండలంలోని చెర్లోపల్లె గ్రామంలో వెలసిన శ్రీ రెడ్డెమ్మతల్లి ఆలయంలో ఆదివారం భక్తుల రద్దీ నెలకొంది. సంతానాన్ని ప్రసాదించే చల్లని తల్లిగా ప్రఖ్యాతిపొందిన అమ్మవారి ఆలయానికి ఉదయం నుంచే భక్తుల రాక మొదలైంది.రెడ్డెమ్మతల్లీ చల్లంగా చూడమ్మ అంటూ వేడుకున్నారు. ఆలయ పరిసరాల్లోని దిగువ తొట్లివారిపల్లెలో అమ్మవారి అర్చకుల కుటుంబీకులు పంపిణీ చేసే ఆకు పసరును సేవించి మహిళలు అమ్మవారి కోనేట్లో పవిత్ర స్నానమాచరించిచారు. తడిబట్టలతోనే అమ్మవారి ఎదుట సంతానం కోసం వరపడ్డారు. పలువురు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకొన్నారు. భక్తులు ఆలయంలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. కర్ణాటక, తమిళనాడుతో పాటు రాయలసీమ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు అమ్మవారి ఆలయానికి తరలిరావడం గమనార్హాం.

నేడు కలెక్టరేట్‌లో పీజీఆర్‌ఎస్‌

సాక్షి, మదనపల్లె: ప్రజల సమస్యలకు సంబంధించిన వినతులు స్వీకరించి, వాటిని పరిష్కరించేందుకు సోమవారం కలెక్టరేట్‌లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని (పీజీఆర్‌ఎస్‌) నిర్వహిస్తున్నట్లు కలెక్టర్‌ నిశాంత్‌ కుమార్‌ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు తమ గ్రామ, మండల, డివిజన్‌ స్థాయిలో వినతులు అందించవచ్చని తెలిపారు. అక్కడ పరిష్కారం కాని సమస్యలను కలెక్టరేట్‌ పీజీఆర్‌ఎస్‌కు రావొచ్చని సూచించారు. ఆన్‌లైన్‌లోనూ ఆర్జీలను నమోదు చేసుకోవచ్చని, వాటి స్థితిని పరిశీలించుకునే అవకాశం ఉందని తెలిపారు.

అనంత వేరుశనగకు

జీఐతో మరింత విలువ

కురబలకోట: అనంతపురం వేరుశనగకు భౌగోళిక (జీఐ) ట్యాగ్‌ కోసం చైన్నె జీఐ రిజిస్ట్రీలో అధికారికంగా దరఖాస్తు సమర్పించినట్లు మిట్స్‌ డీమ్డ్‌ టుబీ యూనివర్సిటీ వీసీ యువరాజ్‌ తెలిపారు. మిట్స్‌,ఐపీఎఫ్‌సీ సాంకేతిక సహకారంతో అవని ఫార్మర్స్‌ ప్రొడ్యూసర్‌ కంపెనీ ధరఖాస్తు నేతృత్వంలో అందజేసినట్లు తెలిపారు.అనంతపురంలో ప్రత్యేక భౌగోళిక పరిస్థితులు,ఎర్రనేలలు, తక్కువ వర్షపాతం, అధిక ఉష్ణోగ్రత కారణంగా అక్కడి వేరుశనగకు ప్రత్యేక నాణ్యత, 45–52 శాతం నూనె శాతం, విశిష్ట రుచి, ఎక్కువ కాలం నిల్వ సామర్థ్యం ఉండే లక్షణాలు ఉన్నాయన్నారు. జీఐ గుర్తింపు లభిస్తే అనంత వేరుశనగకు చట్టపరమైన సంరక్షణతో పాటు రైతులకు అధిక ఆదాయం, మార్కెటింగ్‌, జాతీయ స్థాయిలో అధిక విలువ పెరుగుతుందన్నారు. డాక్టర్‌ తులసీరామ్‌ నాయుడు, శివయ్య, పవన్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు

జేఎన్టీయూలో అందుబాటులో ఏఐ కోర్సులు

కలికిరి: కలికిరి జేఎన్టీయూ ఇంజినీరింగ్‌ కళాశాలలో 2026–27 విద్యా సంవత్సరం నుంచి కంప్యూటర్‌ సైన్స్‌, ఇంజినీరింగ్‌(ఏఐ) కోర్సు అందుబాటులోకి వచ్చినట్లు కళాశాల ప్రిన్సిపాల్‌ వెంకటేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో భాగంగా విద్యార్థులకు ఆర్టిఫిషియల్‌ ఇంటిలిజెన్స్‌, మెషిన్‌ లెర్నింగ్‌, డేటా సైన్స్‌, అత్యాధునిక పరి/్ఞానం, నైపుణ్యాలను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు చెప్పారు. ఎలక్ట్రానిక్స్‌, కమ్యూనికేషన్‌ ఇంజినీరింగ్‌ విభాగానికి ఉన్న డిమాండ్‌తో సీట్ల సంఖ్యను రెట్టింపు చేసినట్లు పేర్కొన్నారు. కళాశాలల వివిధ విభాగాలకు సంబంధించి 528 సీట్లుం అందుబాటులో ఉన్నాయని, అభ్యర్థులు ఈఏపీసె ట్‌ కౌన్సెలింగ్‌లో సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

కడప వైఎస్‌ఆర్‌ సర్కిల్‌ : అమరావతి ఇన్‌ క్లూజివ్‌ క్రికెట్‌ కప్‌ – 2026 కోసం నిర్వహించిన జిల్లా స్థాయి దివ్యాంగ క్రికెటర్ల ఎంపికలు ఉత్సాహంగా జరిగాయి. వైఎస్‌ రాజారెడ్డి క్రికెట్‌ స్టేడియం నెట్స్‌లో డిఫరెంట్లీ ఏబుల్డ్‌ క్రికెట్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ డిఫరెంట్లీ ఏబుల్డ్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఆంధ్ర సంయుక్త ఆధ్వర్యంలో ఈ ఎంపికలు నిర్వహించారు. ఈ ఎంపికలకు ఉమ్మడి జిల్లా నుంచి అధిక సంఖ్యలో దివ్యాంగ క్రికెటర్లు హాజరయ్యారని డీసీఏఏ జిల్లా కన్వీనర్‌ మనోహర్‌ రాజు తెలిపారు. అనంతరం క్రీడాకారుల నైపుణ్యం ఆధారంగా జట్టు ఎంపిక ప్రక్రియను నిర్వహించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement