కురబలకోట: మండలంలోని మట్లివారిపల్లి గ్రామంలో జనసేన, టీడీపీకి చెందిన వివిధ క్రియాశీలక కుటుంబాలు ఆదివారం వైఎస్సార్ సీపీలో చేరాయి. ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయంలో వైఎస్సార్ సీపీలో చేరినట్లు తెలిపారు. ఎమ్మెల్యే పార్టీ కండువాలు కప్పి వారిని పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన నాయకులు, కుటుంబ సభ్యులు మాట్లాడుతూ ప్రజా సంక్షేమం కోసం పాటుపడిన వైఎస్సార్‌సీపీ పట్ల తాము ఆకర్షితులమైనట్లు తెలిపారు. రానున్న రోజుల్లో వివిధ ప్రజా సమస్యల పరిష్కారానికి పార్టీతో కలసి పని చేస్తామన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేస్తామన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజల విశ్వాసాన్ని మరింత బలోపేతం చేసేలా అందరూ ఐక్యంగా పనిచేయాలన్నారు. గ్రామాల అభివృద్ది, ప్రజా సంక్షేమమే పార్టీ ప్రధాన ధ్యేయమన్నారు. ప్రతి కార్యకర్త పార్టీకి వెన్నెముకలాంటి వారేనన్నారు. అధికార పార్టీ నాయకులు, కార్యకర్తలు వైఎస్సార్ సీపీలో చేరడంతో గ్రామంలో వైఎస్సార్ సీపీ మరింత బలోపేతమైందని అభిప్రాయపడ్డారు.
వైఎస్సార్ సీపీలో పలువురి చేరిక


