వైఎస్సార్‌సీపీకి బీసీలను చేరువ చేయాలి | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీకి బీసీలను చేరువ చేయాలి

Jul 17 2026 1:16 AM | Updated on Jul 17 2026 1:16 AM

కడప కార్పొరేషన్‌: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి బీసీలను చేరువ చేయాలని ఆ పార్టీ రాష్ట్ర బీసీ విభాగం అధ్యక్షుడు రాచగొల్ల రమేష్‌ యాదవ్‌ అన్నారు. గురువారం విజయవాడలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో మాజీ మంత్రి కోడాలి నాని, బీసీ విభాగం వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రమేష్‌ గౌడ్‌లతో కలిసి బీసీ విభాగంపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి వైఎస్సార్‌ కడప జిల్లా నుంచి బీసీ విభాగం జిల్లా అధ్యక్షుడు నేట్లపల్లి శివరామ్‌ హాజరయ్యారు. జిల్లాలో బీసీల యొక్క ప్రధాన సమస్యలు, కూటమి ప్రభుత్వంలో బీసీలకు రాజకీయ ప్రాధాన్యత, ఎన్నికల హామీలు, మొదలగు విషయాలు సమావేశంలో చర్చకు వచ్చాయి. రెండు సంవత్సరాల కాలంలో బీసీ విభాగం చేసిన కార్యక్రమాలు పరిశీలించారు. భవిష్యత్‌లో ఎలా ముందుకు వెళ్ళాలి, బీసీలను పార్టీకి చేరువ చేసేందుకు చేయాల్సిన కార్యాచరణ ప్రణాళికపై చర్చించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement