కడప వైఎస్‌ఆర్ సర్కిల్: ఏసీఏ అండర్–19 మల్టీ డే మెన్ మ్యాచ్‌లు రెండవ రోజు ఉత్సాహంగా కొనసాగాయి. గురువారం వైఎస్‌ఆర్‌ఆర్ ఏసీఏ క్రికెట్ స్టేడియంలో మ్యాచ్‌లో 78 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో తొలి ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన అనంతపురం జట్టు 65.3 ఓవర్లకు 221 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ జట్టులోని సాత్విక్ 111 బంతుల్లో 15 ఫోర్లు, 3 సిక్సర్లతో 105 (సెంచరీ) చేశాడు. కిరణ్‌కుమార్ 36 పరుగులు చేశాడు. కర్నూలు జట్టులోని మల్లికార్జున 5, జితేస్ వర్ధన్ 2, సాయి విఘ్నేష్ 2 వికెట్లు తీశారు. అనంతరం అనంతపురం జట్టు ఫాలోఆన్‌లో పడటంతో రెండవ ఇన్నింగ్స్‌ను ప్రారంభించింది. దీంతో రెండవ ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన అనంతపురం జట్టు 57 ఓవర్లకు 6 వికెట్లు కోల్పోయి 203 పరుగులు చేసింది. ఆ జట్టులోని ఆదినారాయణ 62, సందీప్‌రెడ్డి 56 పరుగులు చేశారు. కర్నూలు జట్టులోని మల్లికార్జున అద్భుతంగా బౌలింగ్ చేసి 4 వికెట్లు తీశాడు. సాయి విఘ్నేష్ 2 వికెట్లు తీశాడు. అయితే కర్నూలు జట్టు బౌలర్ మల్లికార్జున తొలి ఇన్నింగ్స్‌లో 5 , రెండవ ఇన్నింగ్స్ 4 వికెట్లు తీయడం కొసమెరుపు. దీంతో అనంతపురం జట్టు 41 పరుగులు ముందజలో ఉంది. దీంతో రెండవ రోజు ఆట ముగిసింది.
కేఓఆర్‌ఎం క్రికెట్ మైదానంలో..
అదే విధంగా కేఓఆర్‌ఎం క్రికెట్ మైదానంలో జరుగుతున్న మ్యాచ్‌లో 20 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో తొలి ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన నెల్లూరు జట్టు 83.1 ఓవర్లకు 270 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ జట్టులోని లోకేష్ 98, సుశాంత్ 59 పరుగులు చేశారు. చిత్తూరు జట్టులోని యశ్వంత్ చక్కటి లైనఫ్‌తో బౌలింగ్ వేసి 4 వికెట్లు తీశాడు. జయంత్, తేజేష్ రెండేసి వికెట్లు తీశారు. అనంతరం రెండవ ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన చిత్తూరు జట్టు 13 ఓవర్లకు 4 వికెట్లు నష్టానికి 78 పరుగులు చేసింది. ఆ జట్టులోని రోహిత్ 28 పరుగులు చేవాడు. నెల్లూరు జట్టులోని లోకేస్ 3 వికెట్లు తీశాడు. చిత్తూరు జట్టు 121 పరుగుల ముందజలో ఉంది. దీంతో రెండవ రోజు ఆట ముగిసింది.
సాత్విక్,
105 పరుగులు
యశ్వంత్,
4 వికెట్లు
మల్లికార్జున,
5 వికెట్లు
ఆదినారాయణ, 62 పరుగులు


